గురుకులాల్లో ఉద్యోగాల జాతర

తెలంగాణ ప్రభుత్వం

గురుకులాల్లో భర్తీ చేసే ఉద్యోగాలివే

టీఎస్ డబ్ల్యూఆర్ ఈఐఎస్ – 2,267
టీటీడబ్ల్యూఆర్స్ఈఐఎస్ – 1,514
టీఎంఆర్తోస్ఈఐఎస్ – 1,445
ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్ ఈఐఎస్ – – 3,870

తెలంగాణాలో బీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులు 4లక్షలకు పైగా ఉన్నారు. వీరందరూ ఇటీవల టెట్ పరీక్ష రాసి ఉత్తీర్ణులయ్యారు. ఆ వెంటనే టీచర్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడుతుందని ఎదురుచూసిన వారికి నిరాశే ఎదురైంది. ఇంత కాలం తర్వాత తెలంగాణాలో టీచర్ ఉద్యోగాల భర్తీపై కదలిక రావడంతో చదువుకోవడం కోసం సిద్ధవుతున్నారు. అయితే గురుకుల నియామకం ప్రకటన డిసెంబర్ మొదటి వారంలోనే వెలువరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

డిసెంబర్ నాటికి ప్రకటన వస్తే మార్చి లేదా ఏప్రిల్ లో పరీక్ష నిర్వహించి కొత్త విద్యాసంవత్సరం నాటికి టీచర్లకు నియమించాలని గురుకుల నియామక బోర్డు భావిస్తోంది. గురుకుల నోటిఫికేషన్ తర్వాత విద్యాశాఖలో ఖాళీగా ఉన్న 16వేల ఉద్యోగాల భర్తీకి కూడా డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నది.

తెలంగాణాలో ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం గొప్ప శుభవార్త చెప్పిందా?. గురుకుల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 10 వేల ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ ప్రకటన వెలువరించేందకు ప్రక్రియ మొదలు పెట్టింది.

తెలంగాణాలోని నాలుగు గురుకుల సంక్షేమ సొసైటీల పరిధిలో 9,096 టీచర్ ఉద్యోగాలకు గతంలోనే ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. అయితే గురుకులాల్లో ఉద్యోగుల బదలాయింపు, ఎస్టీ రిజర్వేషన్ల పెంపు తదితర కారణాల వల్ల ఆలస్యమైంది. దీంతో తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (TREIRB) నోటిఫికేషన్ వెలువరించ లేదు. తాజాగా ఎస్టీ రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి తాజాగా వెలువడిన కొత్త రోస్టర్ పాయింట్లతో ప్రభుత్వం జీవో విడుదల చేయడంతో ఉద్యోగ నియామకాలకు సంబంధించి కసరత్తు వేగవంతమైంది.

* * * * * * * * * * *

తెలుగు పండితులకు తీరని నష్టం

తెలుగు పండిత శిక్షణ పూర్తి చేసుకున్నవారికి సొసైటీ లలో అర్హత నే ఇవ్వకపోవడంతో లక్షల మంది నష్టపోతున్నారు. కొందరు మళ్ళీ BEd చేస్తున్నారు. ఇంకొందరు చదువుకోవడం మానేస్తున్నారు. ఇంకొందరు ప్రైవేటును నమ్ముకున్నారు. ఇంకొందరికి ఉద్యోగ వయస్సు దాటిపోయింది. ఒకవేళ అనుమతి ప్రభుత్వం ఇచ్చిన ఆంగ్ల భాష కు ఎక్కువగా ప్రశ్నలు ఇవ్వడంతో పాత కాలంలో శిక్షణ పొందిన విద్యార్థులు నష్టపోతున్నారు. నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు

Get real time updates directly on you device, subscribe now.