*ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ‘మన ఊరు మన చరిత్ర’ పై విద్యార్థులకు అవగాహన సదస్సు*

*ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ‘మన ఊరు మన చరిత్ర’ పై విద్యార్థులకు అవగాహన సదస్సు*

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్మల్ లో *’మన ఊరు మన చరిత్ర’*
కార్యక్రమం పై విద్యార్థులకు గురువారం అవగాహనా కార్యక్రమం
నిర్వహించారు. ఈ సందర్భంగా *మన ఊరు – మన చరిత్ర జిల్లా కోఆర్డినేటర్ పి జి రెడ్డి* మాట్లాడుతూ ప్రతి ఊరికీ గొప్ప చరిత్ర ఉంటుందని, ఊరికి సంబంధించిన

ఎన్నో విషయాలు ఉంటాయని, చరిత్రాత్మక నేపథ్యం,
వ్యవహారాలు, మతసామరస్యం, చేతివృత్తుల ప్రత్యేకతలు ఇలా ఒక్కో
ఊరిపై ఒక్కో పుస్తకమే రాయచ్చు అన్నారు. గ్రామాలపై ఒక వ్యాసం,
ఒక పుస్తకం రాసిన బాగుంటుందన్నారు. గొప్ప రచయితలు,
పరిశోధకులు వేల గ్రామాలను కవర్ చేయడం సాధ్యం కాదు. అందుకే *కళాశాల విద్య,* *మరియు తెలంగాణ సాహిత్య అకాడమీ* వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. దేశ చరిత్రలోనే ఏ రాష్ట్ర సాహిత్య అకాడమీ చేయని


విధంగా ‘మన ఊరు మన చరిత్ర’ పేరుతో ప్రజా చరిత్రను ప్రజల
రాసుకునే అద్భుతమైన ఉద్యమానికి తెరలేపిందన్నారు. డిగ్రీ చదివే విద్యార్థులు గ్రామాల చరిత్రను రాయించేందుకు నడుము బిగించిందన్నారు. గ్రామ చరిత్ర, పేరు, గ్రామం లో ఉన్న ప్రాచీన
దేవాలయాలు, భౌగోళిక స్వరూపం, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక
పరిస్థితులపై అవగాహన కల్పించారు. మీమీగ్రామాల చరిత్రను మీరు
రాస్తే భవిష్యత్ తరాలకు గ్రామ చరిత్రను అందిస్తామన్నారు.
కార్యక్రమంలో ప్రిన్సిపాల్ Dr.J BheemaRao, కళాశాల మన ఊరు – మన చరిత్ర సభ్యులు Ajay,Nageshwer, Shankar, Srihari, Umesh, Afreen,
పలువురు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.