పేరడీ గీతం…. తిరుపతి చిలుకమారి

సమదర్శిని చెన్నూరు న్యూస్

*జానకి వెడ్స్ శ్రీరాం లో రివ్వున ఎగిరే గువ్వ శైలిలో*

*పల్లవి*
నింగిన ఎగిరే జెండా
మా దీక్షలు ఫలియించేనా
గగనము ఎగిరే జెండా
మా మనసులు వికసించే నా
స్వాతంత్ర్యం మనకే వచ్చేనా
సంతోషం తనతో తెచ్చేనా

*నింగిన*

*1)చరణం*
బ్రిటిష్ రాజులు వచ్చి
దేశాన్ని విభజన చేసి
మన మనసుకు బాధలు
కలిగించి పాలించారా
ఓఓ……ఓఓ…..ఓఓ….
గాంధీ, నెహ్రూ, ఝాన్సి
రణ సీమను రగిలించేసి
యుద్దాలే జరిపి
స్వాతంత్రం అందించారా
ఈ జెండా కోసమే వారు
ప్రాణాలే అర్పించారు
స్వాతంత్ర్యం తెచ్చి
మన ముందు ఉంచారు
ఎన్నెన్నో బాధల
వెనుక అందిన ఫలమే ఈ జెండా
మన మనస్సుల నిండా
ఆనందమే పండా
ఈ జెండా పండుగ జరపాలీ…
ఆనందంతో ఊరేగాలీ.
*నింగిన*

*2)చరణం*
స్వేచ్ఛా సంతోషాలే
అందించిన ఈ స్వాతంత్ర్యం
రణ వీరులు దీక్షలు పలియించి
అయ్యెను మన స్వంతం
ఓఓ…….ఓఓ…..ఓఓ……
శాంతి సౌభాగ్యాలే
కలిగించిన ఈ స్వాతంత్ర్యం
మన మనసుల బాధలు
తొలగించి అయ్యెను మన స్వంతం
అణువణువునా ఆశలు రేపగా
అరుదెంచిన ఈ స్వాతంత్ర్యం
ఆనందాలన్నీ పంచాలి అను నిత్యం,
అల్లూరి ప్రాణాలే అర్పించగ
వచ్చిన స్వాతంత్ర్యం
అణుక్షణము మనము
మరువద్దు ఇది సత్యం,
ఆకసాన జెండే ఆడాలీ…
అవని పైన మనమే పాడాలీ
*నింగిన*

*చిలకమారి తిరుపతి*
*స్వరమయూరి*
*9640908491*
*చెన్నూరు*

Get real time updates directly on you device, subscribe now.