అశోక్ చక్రవర్తి.నీలకంఠం…జనగణమన

అశోక్ చక్రవర్తి.నీలకంఠం...జనగణమన

*జనగణమన..*

పిడికిలి బిగించి
నడుములు నిటారెట్టి
గొంతులు పిక్కటిల్లి
శ్వాసలన్నీ బిగబెట్టి
పలుకులన్నీ ఒక మాట
వందేమాతరం గీతమేగి
జన గణ మన
ఆలపిస్తుంటే
గగనాన త్రివర్ణం రెపరెఫలాడే..

జెండా ఊంచా రహే హమారా.

భారత దేశం
రత్నగర్భ సుసంపన్నం.

భిన్నత్వంలో ఏకత్వం…
కులమతాల ఐకమత్యం..

వేష,భాషలు వేరైనా
ప్రాంతాలు అనేకమైన
దేశమొక్కటే భారతీయం.

స్వేచ్చా స్వాతంత్ర్యం విరసిల్లే..
హక్కుల బాటన
నేటి భారతం.

రాజ్యాంగం అమలయ్యే
గణతంత్రం సిద్దించే
సువిశాల భారతావని
ప్రపంచానికే ఆదర్శమై…

స్వాతంత్ర్య కాంక్షన
ప్రాణాలొడ్డిన వీరులొకవైపు
ఉరితాడులను ముద్దాడిన సమిధలొకవైపు…

శాంతి మంత్రంతో పోరు సలిపిన స్వాతంత్ర్య సమర యోధులొక వైపు..

స్వేచ్చాగాలులు వీచిన వేళ..

ఎక్కడో అపసృతులు..
స్వేచ్చా సమాన హక్కులు లేని రాజ్యమది…

రాజ్యాంగ రూపకల్పనతో
అన్ని హక్కులకు ప్రాణం పోసిన తరుణం…

అది అమలయ్యిన నాడే ఈ గణతంత్ర దినోత్సవం.

అంబేద్కర్ అంటే దారిలో పెట్టిన విగ్రహం కాదు.
అది సమాజానికి దిశ, దశను చూపే రాజ్యాంగ నిర్మాత..

ఎలిగెత్తి పిలవాలి
నా దేశం భారతదేశం
సమాన హక్కులు కలిగివున్నది.

ఈ నేలన ఎన్ని వన్నెలు ఉన్నా
భారతావనికి మువ్వన్నెలనే అందం…

అందరం కలిసి ప్రతిజ్ఞ చేద్దాం..

భారతదేశం నా మాతృభూమి……

వందేమాతరం.

శుభాకాంక్షలతో

అశోక్ చక్రవర్తి.నీలకంఠం.
9391456575.

Get real time updates directly on you device, subscribe now.