79 కోట్ల డోసుల మైలురాయి దాటిన భారతదేశ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం రికార్డు స్థాయిలో 24 గంటల్లోనే 2.5 కోట్ల డోసులు పంపిణీ 97.65 శాతానికి చేరిన రికవరీ రేటు గత 24 గంటల్లో 35,662 కొత్త కేసులు నమోదు మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు (3,40,639) 1.02 శాతం వారపు పాజిటివిటీ రేటు (2.02 శాతం) గత 85 రోజులుగా 3 శాతం కంటే తక్కువ Posted Date:- Sep 18, 2021 కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భారత్‌ మరో రికార్డు సృష్టించింది. రికార్డు స్థాయిలో ఒక్కరోజులోనే 2.5 కోట్లకుపైగా డోసులను ప్రజలకు అందించింది. దీంతో, టీకా కార్యక్రమం 79 కోట్ల (79,42,87,699) డోసుల మైలురాయిని దాటింది. ఈ రోజు ఉదయం 7 గంటల వరకు తాత్కాలిక సమాచారం ప్రకారం; గత 24 గంటల్లో ఇచ్చిన టీకా డోసులు 2.15 కోట్లుగా ఉండగా, రాష్ట్రాలు నివేదించిన ప్రకారం 2.5 కోట్లకు పైగా ఉన్నాయి. 78,49,738 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది. అర్ధరాత్రి దాటిన తర్వాత వచ్చే తుది నివేదిక ప్రకారం, రోజువారీ టీకాల కచ్చిత సంఖ్యను నవీకరిస్తారు. ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: ఆరోగ్య సిబ్బంది మొదటి డోసు 1,03,67,858 రెండో డోసు 86,96,165 ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు మొదటి డోసు 1,83,43,570 రెండో డోసు 1,44,00,387 18-44 ఏళ్ల వారు మొదటి డోసు 32,12,63,332 రెండో డోసు 5,62,22,452 45-59 ఏళ్ల వారు మొదటి డోసు 14,93,59,311 రెండో డోసు 6,77,70,267 60 ఏళ్లు పైబడినవారు మొదటి డోసు 9,61,06,803 రెండో డోసు 5,17,57,554 60 ఏళ్లు పైబడినవారు 79,42,87,699 ఈ అద్భుత విజయం పట్ల దేశ ప్రజలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ట్విట్టర్‌ ద్వారా అభినందనలు తెలుపుతూ ఈ విధంగా వ్యాఖ్యానించారు: "రికార్డు స్థాయి టీకా కార్యక్రమంపై ప్రతి భారతీయుడు గర్విస్తాడు"