అతిథి అధ్యాపకుల దరఖాస్తులకు ఆహ్వానం

ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మల్

*అతిథి అధ్యాపక నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం*

నిర్మల్ జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో 2022-23 విద్యా సంవత్సరానికి తాత్కాలిక పద్దతిలో *అతిథి అధ్యాపక* (Guest faculty) నియామకం కొరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జె భీమరావు ఒక ప్రకటన లో తెలిపారు.

*ఖాళీలు:*
*జంతుశాస్త్రం – 1*
*విద్యార్హతలు*
కనీస అర్హత : సంబంధిత విషయంలో 55% తక్కువ కాకుండా (SC ST లకు 50%) పీజీ ఉతీర్ణులై ఉండాలి.
పీహెచ్డీ(PhD), నెట్(NET), సెట్(SET) అర్హతలు ఉన్నవారికి మొదటి ప్రాధాన్యత.
సంబంధిత విషయం లో బోధన అనుభవం ఉంటే అదనపు అర్హతగా పరిగణిస్తారు.
అన్ని ధ్రువ పత్రాలతో నవంబర్ 14 వ తేదీ ఉదయం 11 గంటల వరకు వరకు కళాశాల లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు, అదే రోజు అనగా నవంబర్ 14 వ తేదీన ఉదయం 12 గంటలకు ముఖాముఖి ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుందని వారు తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.