ఖమ్మం కళాశాల లో అన్యాయం రాజ్యమేలుతోందా?

పి హెచ్ డి అభ్యర్థి కి ఇవ్వని గెస్ట్ పోస్టులు

సమదర్శిని న్యూస్ ఖమ్మం : 11.10.2023
ఖమ్మం కళాశాల లో అన్యాయం రాజ్యమేలుతోందా? అవుననే చెప్పాలి, రెగ్యులర్ సహాయాచార్యులు మరియు ప్రిన్సిపాల్ కుమ్మక్కు అయి ఒక పి హెచ్ డి వున్నా వ్యక్తిని కాదని అతని కన్నా తక్కువ చదువుకున్న వారికి గెస్టు పోస్టులు కట్టబెడుతున్న వైనం ఇది, వివరాల్లోకి వెళ్తే డాక్టర్ వి యేసు రత్నం ఆర్థిక శాస్త్రం లో డాక్టరేటు పొందిన వ్యక్తి అతన్ని కాదని ఆశ బేగం కు గెస్టు పోస్టును కట్టబెట్టడం, సీసీ మార్గ నిర్దేశాలు పక్కన బెట్టి కావాలని సదరు వ్యక్తిని ఎంపిక చేయకుండా డాక్టర్ గోపి దురుద్దేశంతో అడ్డుకున్నారని తెలుస్తుంది. గతంలో గెస్టు గా పని చేసిన వ్యక్తికి పని అనుభవాన్ని పరిగణలోకి తీసుకోకుండా నిర్లక్ష్య ధోరణి కనిపిస్తుంది. ఏవో సాకులు చెప్పి ఉద్యోగం ఇవ్వకుండా రోడ్డున పడేస్తున్నారు కొందరు ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ లు, 2022-23 విద్యా సంవత్సరం లో గెస్టు లుగా పని చేసిన వారిని అందరిని రినివల్ చేయాలని హైకోర్టు ఉత్తర్వులను తుంగలో తొక్కి అటు సీసీ ఇటు ప్రిన్సిపాల్ లు ఇష్టా రాజ్యం గా వ్యవహారిస్తున్నారు. అన్యాయం జరిగిన డాక్టర్ వి యేసు రత్నం కు న్యాయం చేయాలని జేఏసీ కోరుతుంది. లేని యెడల రాష్ట్రంలో తీవ్ర పరిణామాలు తలెత్తుతాయి. సీసీ 3 మెన్ కమిటీ వేసి ప్రతి సంవత్సరం గెస్టు లతో ఆటలాడుకుంటుంది. 1940 గెస్టు పోస్టులు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చినా విద్యా శాఖమంత్రి సబితా గారు బడ్జెట్ లేదనడం విడ్డురం. వెంటనే డిగ్రీ కళాశాలల్లో గెస్టులను నియమించాలి. అన్యాయం జరిగిన డిగ్రీ గెస్ట్ ప్యాకల్టీ లకు న్యాయం చేయాలని జేఏసీ కోరుతుంది.. జే డి ఉత్తర్వులను ఖాతర్ చేయని జాకీరుల్ల కళాశాల ప్రిన్సిపాల్, బందు ప్రీతి తో తీరని అన్యాయానికి ఒడికట్టారు. ఒ అబాగ్యునికి అన్యాయం చేశారు. సీసీ నిబంధనలు పాటించడం లేదు.

Get real time updates directly on you device, subscribe now.