అ”విరామం”

ISBN APPROVED MAGAZINE

అ”విరామం”

మనిషి బతుకు పోరులో పడి..
యంత్రాలతో సమానంగా పోటీపడి..
మనీ వేటలో పడి .. అవిరామంగా..
అనంతమైన ..
అత్యాశ అయిన..
అనర్ధమైన..
కోరికల పద్మవ్యూహంలో పడి …
కొట్టుమిట్టాడుతూ..
కన్న తల్లిదండ్రులతో..
కట్టుకున్న భాగస్వామితో…
కనిపించిన బిడ్డలతో…
కనీసమైన …
ఆప్యాయతలను, అనురాగాలను ,ఇష్టాలను ప్రేమను పరస్పరం ఇచ్చిపుచ్చుకోలేకపోతున్నా..
ఓ మనిషి ..
ఇకనైనా మనిషిలా(money షి) కాకుండా… “మనీషి” లా…( మనుషుల్లో గొప్పవాడిగా)
మారడానికి ప్రయత్నించు…
కుల,మత, రాజ్యం ,వయోభేదం లేకుండా..
ప్రతి ఒక్కరికి ప్రకృతి ప్రసాదించిన …
విరామకాలాన్ని ..
అవిరామంగా..
సద్వినియోగం చేసుకోండి..

ఇన్నాళ్లు మీ మనసు పొరల్లో నిగూఢంగా …
నిద్రాణమై …
నిక్షిప్తమై ..
ఉన్న..
మీ ఆలోచనలను వెలికి తీయండి..
మీ నైపుణ్యాలకు మెరుగులు దిద్దండి …
మీ మనసు విప్పి మాట్లాడండి.
మీ ప్రేమానురాగాలను పంచండి ..
అసలు…
మీరేంటో తెలుసుకోండి…

అవిరామ కృషితో ..
విజయ పథాన నడవండి…

✍️ రాధిక వనం
పీజీ సిఆర్టి తెలుగు
కేజీబీవీ, బయ్యారం, మహబూబాబాద్ జిల్లా

Get real time updates directly on you device, subscribe now.