బతుకు బడలికలు

శ్రీమతి రాజ్యలక్ష్మి గారు

2021 చిలకమారి కథలపోటీ ఎంట్రీకథ
అంశం కుటుంబ గౌరవం విలువలు
శీర్షిక బతుకు బడలికలు
కథ
రామనాధం గారు ఇంట్లో పెద్ద కొడుకు. వీధి వారికి పెద్ద దిక్కు. పెద్ద సంస్థ లో ఓపిగ్గా నెగ్గుకొస్తున్న చిరుద్యోగి. ప్రభుత్వ కార్యాలయం కాదు సంస్థ అవసరాల రీత్యా  బదిలీలు లేవు. చేబదుళ్ళు షరా మామూలే. అందరూ నెలాఖరు లో అప్పారావులవుతూ ఋణానంద లహరి లొ లాహిరి లాహిరి అని సోలో గా పాడుకుంటూ అప్పుల గురించి భార్యలకు వీలైన్నంత వరకూ తెలియకుండా గొప్పగా గడుపు తుంటారు..
ఆ దంపతులకు ముగ్గురు పిల్లలు.              పెద్దమ్మాయి రాధిక చదువుకుంటూ పెళ్ళికి ఎదుగుతూ యువతల ఆరాట పోరాటల సునామీలో సహజమైన ఎదురీత చేస్తుంది.ఎప్పటికైన కనీస సౌకర్యాలు కలిగున్న కుటుంబం ఏర్పరచుకోవాలని తీర్మానించుకుంది.
రెండో సంతానం. కుమారుడు రాకేశ్. చదువు చక్కగా రావడం తో కొద్దో గొప్పో సంబరపడుతూ కుటుంబపు ఆర్ధిక స్థాయి తన స్వశక్తి తో పెంచా లనుకుంటాడు. అక్క ఆరాటపోరాటల పట్ల గౌరవం.అక్క అనుకున్నది సాధించాలన్న చిన్న ఆశ కలిగిన వాడు. తానేం చేయగలడో చేసి తద్వారా తన కుటుంబం సంతోషంగా ఉండాలనే అభిలాష. పైచదువుల మోజు ఉన్నా విదేశ ఉద్యోగాల ఆకర్షణ వలలో పడలేదు పడదలచుకోలేదు..  సొంత ఊరు పరిసరాలను వాన తర్వాతి మట్టి వాసన లా గట్టిగా పట్టుకున్న వాడు.

చివరి పిల్ల సత్యవతి అందరు పెద్దల మధ్య ఔత్సాహిక కొత్త రాజకీయ పక్షం  లాగా..
అందరూ ముద్దు చేసినా గమనమంతా అన్న అక్క ఆ తర్వత.. చిన్ని యువరాణి. పుచ్చకాయల మధ్య జామకాయంత, చగోడీలు చక్కిలాల మధ్య కారపూసంత .. అందరి పెద్ద వాళ్ళనూ గమనిస్తూ ఇది సబబే ఇది మరీ బాలేదని  బేరీజు వేస్తూ తన వారందరి కన్నా బాగా చేయాలని అనుకుంటుంది.
ఈ కుటుంబపు పెద్ద భరోసా రెండు పడక గదులున్న సొంత ఇల్లు.. ఆలంబన.. రామనాధం చిన్నప్పటి నుంచి పక్కనే ఉంటూ వారి బతుకు నడకలో తోడు గా వస్తున్న ఇరుగుపొరుగు.
బంధువులు అప్పుడప్పుడు వచ్చి పలకరిస్తుంటే ఇరుగు పొరుగు మాధ్యమాల పరుగుల  లాగా పొదస్తమానం పలకరింపులే..  కుటిలత్వం లేని మహిళల గోష్టులు.కష్టసుఖాలు చెప్పుకోవడం తో దిగుళ్ళు తీరడం రోజూ  వచ్చే అదనపు ఆదాయం.. సమస్యలు పరిష్కారం కాకున్న గుండె బరువు దింపుకోవడం..అప్పుడప్పుడు ఆ మాటల మధ్య నుంచి ఓ దారేదైన  దొరుకుతూనూ ఉంటుంది..
పొద్దున్నే వసరాలో కూచుని వార్తాపత్రిక తిరగేస్తూ ఆలోచనలో ఎక్కడికో వెళ్ళి అక్కడ ఆగి ఈ పిల్లాడికి ఓ మంచి స్ధానిక ఉద్యోగం దొరికితే అన్న ఆశ రూపుదిద్దుకున్న  అందాల కలను కొనసాగిస్తూ కమ్మని కాఫీ  తో వచ్చిన భార్య రాజీవలోచని ని గమనించలేదు. ‘ కాఫీ తాగండి కలల రంగులు బహు పసందై పోతా’ యంటూ
భార్య చేసిన హాస్యం నచ్చింది. ఒక చిన్న నప్పాశ ‘ కాస్త చక్కెర చిలికించావా..’
‘ మరే అత్యాశలు వద్దండి. గుటుక్కుని కాఫీ తాగేయండి ‘..అంది..
చక్కెరేసిన చిక్కటి కాఫీ కల ఎప్పటికీ తీరనంటుంది. ఇన్ని కనిపెడతారు ఈ శాస్త్రవేత్తలు.. మధుమేహానికి చక్కెరకు సంబంధం లేదని ఎందుకు కనిపెట్టరో అని వాపోతూ..బాగా డబ్బొస్తే ఈ పరిశోధన  కు పెట్టుబడులు అందించాలని మనసు లో  తీర్మా నించారు. మనసు లోనే.. నిజమే ప్రజలకు ఉపయోగపడే తీయటి కలలే కనాలి.

కాఫీ తాగడం సగం లో ఉండగా పక్కింటి పరమేశుడు సాక్షాత్కారం.. అతన్ని చూసిందే అలవాటు గా సగం పత్రిక  ఇచ్చి ‘ కూర్చో సామి ఎమిటి సంగతులు ‘ అంటూ పలకరింపు.
‘ చక్కెర లేని కాఫీ తో ఇంకో  సమావేశం.’ అంటూ ‘ రైల్వే లో ఉద్యోగాలు పడ్డాయి చూశావా 85 ఖాలీలు.ఎన్నో ఆనవాయితీగా ఉత్తర దక్షిణాలకు  పోయినా కొన్నైనా మన లాటి వారికి  వస్తాయనుకో ‘అన్నాడాయన.
‘ఎవరికీ?’ అన్నట్టు ప్రశ్నార్థకంగా చూశాడీయన.
‘రాకేశు చదువు ఆఖరి సంవత్సరం కదా, ఓ కాగితం పడేయమను. వాళ్ళు ఎంపిక కు పిలిచినప్పుడు చూద్దాం’ అని నిర్ణయం  ప్రణాళిక చెప్పేశాడు. ఎంత తన వార్తాపత్రిక రోజూ ఉచితం గా చదివినా ఒక ఉపయోగమైన మాట చెప్పాడని కాస్త మనసు లోనే కనికరించాడు పక్కింటాయనని.
నిస్వార్ధమైన సలహా. ‘ మీ కేశవుడికీ వస్తుందేమో ‘ అన్నాడు. ‘ అబ్బె వాడిప్పుడు మూడో సంవత్సరం . ఇప్పుడే కుదరదు. చేయలేడు. ఆఖరి ఏడాది చదువుతున్న  వాళ్ళే చేయగలరు. మీ పిల్లాడు అన్ని విధాలా సరిపోతాడు ‘ అంటూ రాకేశునే కేకేశాడాయన. చెప్పండి బాబాయ్ అని వెంటనే ప్రత్యక్షమైన కొడుకును చూస్తూ వీళ్ళిద్దరిది అసుర గాఢ మైత్రి వీడు నాకంటే ఈయనకే దగ్గర అనుకున్నాడు రామనాధం.
ప్రకటన క్షుణ్ణంగా చదివి చర్చించిన తర్వత  ఇద్దరూ ఓ రాయి వేయడమే భేషనుకున్నారు. ఆ పని లో మునిగారు. వాళ్ళనో చూపు చూసి సంపాదకీయం లో దూరి పోయిన రామనాధాన్ని వాళ్ళూ పట్టించుకోలేదు.
కళాశాల చదువు  ముగించి ఉద్యోగాల వేట లో ఉన్న రాధిక స్నేహితురాలు వనజ తో మాటల్లో ఖాళీగా మిగులుతున్న..  ఉన్న సమయం గురించి మాట్లాడుతుంటే ఎదైనా చేస్తే బాగుంటుందని ఆలోచన  వచ్చింది.. అంతర్జాల వలయానికి అతీతం గా ఏమున్నాయని తరచి తరచి చూస్తుంటే
విజ్ఞాన శాస్త్రం లెక్కలకు  అభ్యాస ప్రశ్న పత్రాలు తయారు చేస్తే విద్యార్థుల  అభ్యాసపు అవసరాలకు పనికి వస్తాయని భావించారు. ఇంట్లో కూచుని చర్చించి తయారు చేయాలి. వనజ ఇంట్లోకన్నా ఇక్కడే వీలనుకున్నారు.. ఇద్దరూ తల్లుల కు చెప్పే సరికి వారూ ఒప్పుకున్నారు. పైగా ఇంటి పట్టున ఉండి పని చేసుకుంటే ఏ బాదరబందీ లేదు. ఇళ్ళూ దగ్గరే నడక తో చేరుకోవచ్చు. అమ్మాయిలు విద్యారంగం వైపు ఉరుకులు..కొడుకు కళాశాల  కు పరుగులు.చిన్న గడుసు పిల్ల బడి ఆటలంటూ గెంతులు. కోపాన తల్లికి కుప్పి గంతులనా లనే ఉంటుంది. కన్న పేగు అనడానికి మనసొప్పదు..

*********
ఓ నాలుగు నెలలు సాదాసీదాగా గడిచాక రాధిక వాళ్ళ పుస్తకం  ఓ కొలిక్కి వచ్చి రూపు దిద్దుకుంది. ఆ చుట్టుప్రక్కల ఉన్న వారి సహపాఠులకు బాగా రాశారనే అనిపించింది. తమకు  పరిచయస్తులైన ఉపాధ్యాయులు ముఖ్యంగా అభ్యాస శిక్షణలిచ్చే సంస్థల  వాళ్ళకూ చూపించి అభిప్రాయాలు  వారు కొనబోయే కావలసిన పుస్తకాల సంఖ్య తీసుకుని పుస్తకాల ముద్రణ యాగం లో పడ్డారు.. డబ్బు పుస్తకాలు కొంటమన్న అంగీకారం వచ్చాకే ముద్రణాలయపు  మెట్లు ఎక్కారు. వనజ తండ్రి చొరవ తో పెద్దరికపు సాయం తోడయ్యింది.. పుస్తకాల పంపిణీ తర్వాత వెనక్కి చూస్తే పాఠ్యాంశాలకు న్యాయం చేశామన్న సంతోషమూ  ఇద్దరమ్మాయిలకు పాఠ్య పుస్తకాల రచయితలుగా గుర్తింపు వచ్చాయి.. పిల్లలకు ఈ అభ్యాస పధక పుస్తకాలు పనికి రావడం దాంతో బాటు  నేర్చుకోవడం సులువైయ్యే సరికి ఈ పుస్తకాల  మలి విడత  కొనుగోలు టక్కున దొరికింది.. పై తరగతి పుస్తకాలు రాయడం లో ఇద్దరూ నిమగ్నమయ్యారు. వీరి ప్రయత్నం లో ఉపాధ్యాయులు, విషయ పరిజ్ఞానం లో ఆసక్తి ఉన్నవారి అభిప్రాయాల సేకరణ చేయూత నిస్తుంటే పని చక్కగా ముందు కెళుతున్నది. డబ్బు వచ్చెదెటున్నా సమాజం లో గౌరవం వారి నైపుణ్యాలకు గుర్తింపు వచ్చాయి.. చదువు సార్ధకమయ్యింది.. ఉన్నంతలో మంచి గుర్తింపు వచ్చింది.. జీవితంలో సాఫీగా పయనించే దారి దొరికింది..
కుటుంబం లో సమాజం లో వారు న్యూన పడని జీవిక దొరికింది..
ఎప్పటి లాగే వార్తల వేట లో వచ్చిన   పరమేశం గారి లో ఎదో సంకోచం కనపడి రామనాధం ఎమిటన్నట్టు చూసి ‘ చెప్పవయ్యా ఎమిటో ఆలోచిస్తున్నావు    ఏ విషయం ‘ అంటుంటే ‘ అలా నడుస్తూ మాట్లాడుకుందాం. తెలిసిన కథే. స్థిరపడిన కొడుకుల పెళ్ళి గురించే.నాకో ఆశ కలిగింది నీతో చెబితే నా ఉబలాటం ఆరాటం అర్ధం చేసుకుంటావని  ‘.అని నసుగుతుంటే
‘ సంచి లోంచి చెవులు మీసం లీలగా కనబడ్డాయి.ఇహ పిల్లిని బయట పెట్టవయ్యా ఎదో మంచి విషయమే అయ్యుంటుంది ‘ అని ధైర్యం చెప్పాడు రామనాధం.
‘ మా నడిపి వాడికి ఆ పిల్ల చక్కగా కుదిరి పోతుంది.ఆరు నెలల బట్టి చూస్తున్నా అదే నవ్వు అదే నడత ‘..అంటూ అర్ధోక్తి లో ఆగాడాయన..
‘ అంటే మా వనజమ్మేనా  ‘ ఆత్రం ఆపుకోలేక ‘మంచి పిల్ల ఒప్పుకుంటే లంకె బిందెలే ..పెద్దాడికి తర్వాత అనుకుంటావా ‘ అని బండిని ముందుకు నడిపిస్తునే ఒప్పుకుంటే అంటూ అర్ధోక్తి తో అడుగు  వేశాడు..
‘వాళ్ళిల్లు నడిస్తే పావుగంట వెళ్ళి కనుక్కుందామా ‘ ఆశగా అడుగుతుంటే రామనాధం మారు మాట్లాడకుండా అడుగులు ముందుకు వేయడం తో ఇద్దరి కాళ్ళు వనజ ఇంటి దారి పట్టాయి.
వనజ వీళ్ళిద్దరూ రావడం తో ఆతురత గాభరా కలసిన గొంతు విప్పి రమ్మని కూచోమంది. నాన్నగారు ఇంట్లో ఉన్నారా అన్న ప్రశ్నకు అప్పుడే   బయలుదేరారు వచ్చేస్తారని బదులిచ్చి కాఫీలు కలుపుకుని వచ్చింది.
చక్కెర లేని కాఫీయే ఇవ్వడం తో రామనాధం మనసు లో ఈ పిల్ల నా కోడలు కావడం లేదు .తప్పించుకున్నా. అని తెగ సంబరపడిపోతే పద్ధతి గల పిల్ల అని పరమేశం ఉప్పొంగి ఉరకలే..మోకాళ్ళ నొప్పులు లేకుంటే పరుగులే పరుగులన్నంత హుషారు.
వనజ తండ్రి రావడం తోనే రామనాధం తన గురించి పరమేశం గురించి చెబుతూ మీతో ఓ విషయం మాట్లాడాలి అనడం ఆలస్యం ఆయన వనజని పొరిగింటికి తోలేసి భార్యను వీళ్ళ మాటల్లో పాల్గొనమని సూచించి.  ‘ చెప్పండి మీ గురించి వనజ చెబుతుంటుంది. ఇద్దరు పెద్దలు వచ్చారంటే పెద్ద విషయమే ‘ అని సూచిస్తుంటే ఉప్పెదో అందినట్టే అనిపించింది..
పరమేశం విషయానికి సూటిగా వచ్చేసి తమ రెండో అబ్బాయి కి వనజ ను ఇస్తారా అని స్పష్టంగానే అడిగేశారు. వనజ తండ్రి రాఘవరావు లోకం చూసిన మనిషి.. సూటిగా ప్రస్తావించారంటే తమ పిల్ల బాగా నచ్చినట్టుంది అనుకుని.. ‘ మా అబ్బాయి కీ చూస్తున్నాము. కుదిరితే రెండు శుభకార్యాలు ఒకే సారి చేసుకోవచ్చు. మీ అబ్బాయి సమ్మతించాడా అనేయడం తో ఇప్పుడేగా గెలుపు కు ఓ మెట్టెక్కాము.  అనుకుని ఇద్దరం ఈ రోజు మాట్లాడి పిల్లల మనసు తెలుసుకుందామంటూ బయలుదేరబోతుంటే రామనాధం గారూ మీరు మాత్రం ఉత్త చేతులెందుకు? మీ రాధిక ను మా ప్రసాదు కేమైనా ఇచ్చే ఉద్ధేశ్యం వుందంటారా అన్న రాఘవరావును చూస్తే ఆశ్చర్యం వేసింది.ఇంత సహజంగా మాట్లాడుతూ పలకరిస్తుంటే  అసలు కాదనలన్న ఆలోచనే రాదు..
పైగ కాదన్నేంత గా కారణాలూ లేవు.వనజ రాధికా కలిసి పని చేస్తున్నారు. ఈ సంబంధం కలుపుకుంటే ఇద్దరూ తమపని కొనసాగిస్తారు.. తమకూ ఇద్దరు పిల్లలూ దగ్గరే ఉంటారు. అమ్మాయిని ఓ మాట కనుక్కుని ..ఒప్పుకుంటే రేపు లాంఛనం గా రెండు జంటలకూ పెళ్ళి చూపులు మా ఇంట్లో అని అనుకోకుండానే అనేసి ఇద్దరూ ఇంటి దారి పట్టడం.. అటు రాఘవరావు ప్రసాదు కు రేపు పొద్దున్నే ఇక్కడుండాలని చెప్పడం ఒకే సారి జరిగి పోయింది.
ఇంటి కొచ్చే నడకలో నిదానం సంబరం కొత్త పులకింత రోజు వార్తల సమావేశాలు కలసి  చదివే స్నేహం వలన ఇంత మంచి.. కలిసొస్తే స్నేహితురాళ్ళు బంధువులవుతారు రెండు వైపులా అరమరికలు లేని దైనందిన జీవితం పైగా అమ్మాయిల రచనా వ్యాసంగం చక్కగా జరిగి పోతుంది..
ఇంటి కొచ్చిన తర్వాత ఇద్దరూ రామనాధం వాళ్ళింట్లో తమ భార్యలను  సంప్రదించాక ఈ సంబంధాల లో  ఆదాయం ఎక్కువ వ్యయం పూజ్యం  అన్న నిజం తెలిసింది సరే ముందుకెళ్ళి పెళ్ళి చూపుల వరకూ లాగుదాము అమ్మాయిలూ అబ్బాయిలు ఒప్పుకుంటే తర్వాతి ఘట్టం అని తీర్మానించుకుని రాఘవరావు వాళ్ళింట్లో వాళ్ళని   నేరుగా పలకరించారు . ఆయన అప్పటికే కూతురు కొడుకులను మొత్తం కుటుంబసభ్యులనూ  సమిష్టి సంభాషణల లో కూచుండబెట్టి విషయాలు వివరించి ముగించారు. పిల్లల సుముఖత తేటతెల్లం గానే ఉంది. రాధిక పరమేశం కొడుకు పార్ధుల నిర్ణయమే తేలాలి..
వనజ అన్నయ్య కాబట్టి రాధిక ఒప్పుకున్నటే ఉంది. పార్ధు ఓకే అన్నా అన్న గురించి సందిగ్ధం లో పడ్డాడు. పెద్ద వాడైన ప్రతాప్ నీ పెళ్ళి కానీ ఆ సందర్భం లో ఇంకేదైనా సంబంధం వస్తుందేమో ఈ వచ్చిన అవకాశాన్ని వాడుకుందాం అనే సరికి పరమేశం మనసు పరవళ్ళు తొక్క సాగింది.
నిజమే ఒక పెళ్ళి లో ఎన్నో కొత్త బంధాలు చిగురేసి మొగ్గ తొడుగుతాయి..
పెళ్ళి వరుస లో ప్రతాప్ తమ్ముడు ప్రవీణ్ ఉన్నారు. ఒకరి పెళ్ళి స్థిరపడుతోంది..

మరు రోజు లాంఛనంగా పెళ్ళి చూపులు రామనాధం వాళ్ళింట్లో.. సహజమైన కుటుంబ వాతావరణం.. అమ్మాయిలు అబ్బాయిలు చూసుకోవడం కొత్తే ..అన్ని విషయాలు ఇంటిల్లిపాదికీ తెలుసు.. రాధిక పార్ధు అక్కతమ్ముళ్ళ లా కలిసి పెరిగారు. వనజ ద్వారా ప్రసాదు కు రాధిక వ్యక్తిత్వం తెలుసు. ప్రసాదు గురించి వనజ మాటల్లో చెబుతూనే ఉంటుంది. పార్ధు ఎన్నో సార్లు ఇద్దరమ్మాయిలకీ సాయపడ్డాడు.
ఓ గంట సేపు మాట్లాడాక శుభ ప్రస్థావన తో ముగించారు.. వనజ పక్కింటికి రాబోతుంది. రాధిక వనజింట్లో కాపురానికి.. బతుకు బంతాట  లో రామనాధం దంపతులు మూడు దఫాలు ఆడాల్సుంటే మొదటిది సుఖాంతమే..
జీవిత పరుగు పందెం లో మూడు పదుల దాంపత్యం లో ఆర్ధికమైన ఒడిదుడుకులు వేధిస్తున్నా చిన్న చిన్న ఆశలు తీరిన సంబరాలు అంబరాలను అంటుతుండేవి…  ఎలా ఎల్లుండి ఆవలెల్లుండి అన్న సడలింపు లేని ఆలోచనల బడలికలను ఈ పెళ్ళి ప్రస్థావన సేద దీరుస్తోంది.. పిల్లాడికి ఉద్యోగం వచ్చినప్పుడు వస్తుంది చిన్న వాడే. సరియైన సమయానికి పెద్ద పిల్ల పెళ్ళై పోతే నిండు మనసుకు పండంటి పగలు.. చిన్న పిల్లదేముంది అక్క బావ అన్న వదినా తలో చేయేస్తే తళతళలాడే తలంబ్రాలే.. పెళ్ళే ముఖ్యం కాదు. పెళ్ళి ఎన్నో ముఖ్యమైన దిశల కుటుంబ శాఖలు విస్తరించడానికి వేరును సమాయత్తపరుస్తుంది. ఒక్క పెళ్ళి తో ఎన్నో బంధాలు అల్లుకునే పందిళ్ళు అమర్చుకుంటాము. ఆనంద పడతాము.

హామీ పత్రం
ఈ పోస్టులో రాసిన’బతుకు బడలికలు’ కథ నా స్వీయరచన. 2021 చిలకమారి కథల పోటీ కొరకై ప్రత్యేకంగా రాసినది.
ఇట్లు
రాజ్యలక్ష్మి. ఎ చేవ్రాలు

రఛయిత వివరాలు
పేరు రాజ్యలక్ష్మి. ఎ
ఊరు చెన్నై
చరవాణి 9487486985
చిరునామా
F 2 Divyam Apts
473 First Main Road
Mogappair East
Chennai 600037

 

 

Get real time updates directly on you device, subscribe now.