డిసెంబర్ 10 ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం

డిసెంబర్ 10 ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం

డిసెంబర్ 10 ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం

*ఉత్తమ సమాజ నిర్మాణానికి మానవ హక్కుల పరిరక్షణే మార్గం*
మానవ హక్కులు పరిరక్షింపబడినప్పుడే, మానవ సమాజం ఉత్తమ సమాజం గా మనగలుగుతుంది. అప్పుడే నైతిక విలువలకు జవ-జీవాలు అంకురిస్తాయి, ఊపిరిలూదుతాయి . పౌరులు విధులు, బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ.. ఆదర్శవంతమైన సమాజ నిర్మాణంగా రూపొందించబడుతుంది. తద్వారా సమ సమాజ నిర్మాణానికి బాటలు పడతాయి.
ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకు చెందిన చట్టపరమైన అంశాలు, వేర్వేరు నేపథ్యాలున్న ప్రతినిధులు కలసి రెండు సంవత్సరాలు విస్తృత అధ్యయనం, అవగాహనతో మానవ హక్కులను రూపొందించారు. ఈ ముసాయిదా కమిటీకి అమెరికా మాజీ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ భార్య ఎలీనర్ రూజ్వెల్ట్ సారధ్యం వహించారు.
అన్ని దేశాలు మన హక్కులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఉందని తొలిసారిగా ఈ పత్రము నిర్దేశించింది.
మానవ హక్కుల పీటిక లో ఉన్న ముఖ్య ఉద్దేశం ప్రపంచంలో ఉన్న మానవులు అంతా ఒకటే. ప్రతి ఒక్కరికి సహజసిద్ధమైన గౌరవం, సమానమైన శాశ్వతమైన హక్కులు కల్పించబడాలి అని నాడు తలచి రూపొందించారు. మానవ హక్కుల పరిరక్షణకు హక్కుల అణిచివేత లేని సమాజ నిర్మాణం కోసం నిరంతరం సాగాల్సిన కృషికి గుర్తింపుగా ఈ హ్యూమన్ రైట్స్ దినోత్సవాన్ని ప్రపంచమంతా ఏర్పాటు చేయడమైనది. మానవ హక్కుల పరిరక్షణకు ఐక్యరాజ్యసమితి సార్వత్రిక మానవహక్కుల ప్రకటన 1948 డిసెంబర్ 10 ని ప్రకటించింది. ఆనాటినుండి ప్రతి సంవత్సరము డిసెంబర్ 10ని అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం గా ఎంతో వైభవోపేతంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు.

*మానవ హక్కులు* :
జాతి,వర్ణ,లింగ, కుల, మత, ప్రాంత మరియు రాజకీయ ఏ విధమైన వివక్షకు గురికాకుండా ఉండే హక్కు.
జాతి బానిసత్వం నుండి రక్షణ పొందే హక్కు.
సరైన కారణం లేకుండా ఏ మానవుని ఇబ్బంది పెట్టకుండా, నిర్భందించకుండా ఉండే హక్కు.

స్వేచ్ఛగా స్వదేశంలో లేదా విదేశంలో పర్యటించే హక్కు.

అనేవి సార్వత్రిక మరియు సమసమాజ శైలికి చెందినవి.
కానీ,ఇటీవలి కాలంలో మానవ హక్కులకు విఘాతం కలుగుతోంది, మానవ హక్కులు హరించ బడుతున్నాయి. మానవ హక్కుల ఉల్లంఘనకు ఊతం పోసే న్యాయ చట్టపరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయనే అపవాదును మోయాల్సిన పరిస్థితి నేటి చట్టాల, న్యాయ వ్యవస్థల పైన మోపబడుతుంది. అకారణంగా చేయని నేరం, నిందలు మోపబడి ఎంతో మంది జైళ్లలో మగ్గే టట్లు చేస్తున్నారు. అనేటువంటి చేదు నిజాల గూర్చి మానవ హక్కుల సంఘం నేతల ద్వారా, ప్రింట్ , ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వింటూనే ఉన్నాం. మానవ హక్కుల ఉల్లంఘన అనేది సమాజాభివృద్ధికి గొడ్డలిపెట్టు లా మారుతుంది.
కావున ఇలాంటి విషయాలను నిశితంగా పరిశీలిస్తూ… మానవ హక్కులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఆయా ప్రభుత్వాల, పాలకుల , మేధావి వర్గం , న్యాయ నిపుణుల మరియు స్వచ్ఛంద సేవా సంస్థల పైన ఉంది.
—- ప్రతాపగిరి శ్రీనివాసు హనుమకొండ, 79931039424

Get real time updates directly on you device, subscribe now.