అవినీతి రహిత సమాజం వైపు ప్రతి ఒక్కరూ అడుగులు వేయాలి

*అవినీతి రహిత సమాజం వైపు ప్రతి ఒక్కరూ అడుగులు వేయాలి

అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం ప్రతి సంవత్సరం డిసెంబర్ 9న జరుపుకుంటారు. అందులో భాగంగా అవినీతి వల్ల జరుగుతున్న పరిణామాలు, అవినీతిని అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలకు అవగాహన పెంచడానికి ప్రత్యేకంగా ఈ రోజును ఏర్పాటు చేసుకున్నారు. 2003లో ఐక్యరాజ్యసమితి అక్టోబర్ 31న నిర్వహించిన సదస్సులో ప్రతి ఏడాది డిసెంబర్ 9న ప్రపంచ వ్యాప్తంగా ఈ దినోత్సవాన్ని జరపాలని నిర్ణయించారు. అవినీతి లేని దేశం, రంగమూ అంటూ…. నేటి సమాజంలో కనబడటమే లేదు.

అవినీతి కారణంగా పేద ప్రజల జీవన ప్రమాణాలు మరింత దిగజారుతాయి. దారిద్ర్యం, అస్థిరత వివిధ రంగాల్లో పెరిగిపోతాయి. అంతిమంగా అది మౌలిక వసతుల వైఫల్యానికి, రాజ్య వైఫల్యానికి దారి తీస్తుంది. అవినీతి వల్ల మానవ హక్కుల ఉల్లంఘనలు,మార్కెట్, మనిషి జీవన ప్రమాణాలు నాణ్యంలో క్షీనత లాంటివి చోటు చేసుకుంటాయి. వ్యవస్థీకృత నేరాలు పెరిగిపోతాయి.
2012 2019 అధ్యయనం ప్రకారం భారత దేశంలో అవినీతి ఎక్కువగా జరుగుతున్న జాబితాలో ఉందంటే మన దేశ పరిస్థితిని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. డెన్మార్క్, ఫిన్లాండ్, న్యూజిలాండ్, స్వీడన్,సింగపూర్,స్వీటీజర్ ల్యాండ్ వంటి దేశాలు అతి తక్కువ అవినీతి కలిగిన దేశాల జాబితాలో మొదటి 6 స్థానాలు సొంతం చేసుకున్నాయి.

*అవినీతిని అరికట్టడానికి మార్గాలు
కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేయడం. హక్కుల కమిషన్ లను ఆశ్రయించడంజరుగుతుంది యాంటీ కరెప్షన్ సంస్థలు ఏర్పాటు చేయడం. మన దేశాన్ని, మనల్ని మనమే రక్షించుకునే దిశగా ప్రతీఒక్కరూ ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సమాజ మనుగడకు గొడ్డలిపెట్టుగా తయారైన అవినీతిని అరికట్టేందుకు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, ఎన్జీవోలు, మీడియా వ్యక్తులు కలిసికట్టుగా అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పాలుపంచుకుని *అవినీతి రహిత సమాజం వైపు అడుగులు వేయాలి
— ప్రతాపగిరి శ్రీనివాసు, హనుమకొండ 7993103924

Get real time updates directly on you device, subscribe now.