సమదర్శిని పత్రిక ఆధ్వర్యంలో జాతీయ స్థాయి కవి సమ్మేళనం కొరకు
అంశం _ ఉగాది ప్రాశస్త్యం
శీర్షిక _ జీవన సుమగంధ బాట
రచన _ విస్సాప్రగడ పద్మావతి
ఊరు_ హైదరాబాద్
బ్రహ్మకల్పం మొదలు ప్రతికల్పాన్ని
మొదటిగా స్పృశించేది యుగాది
యుగానికి ఆరంభ సోపానం
ఉగాదిగా ప్రాశస్త్యం
రంగవల్లులు ముంగిట మెరియ
మామిడి తోరణాలు స్వాగతాలు పలుకగా
కోయిల గాన మధురిమలు పుడమిని తాకగా
మొదలైన వసంతోత్సవం
షడ్రుచుల సమ్మేళనంతో
ఆప్యాయంగా పలకరిస్తుంది ఉగాది
జీవన భావ సరళి మృదు మధురంగా సాగాలని
జీవితపు ఒడిదుడుకులు
షడ్రుచుల సమ్మేళనం అని గుర్తు చేస్తుంది ఉగాది
తెలుగు వారి. అపురూప సంస్కృతిని
భావతరాలకు అందించే ఉల్లాస నావ ఇది
ప్రతి పండుగ వెనుక ఒక పరమార్థం
అందరికి ఆలోచనా భరితం
ఆచరణాత్మకం,ఆదర్శం
మేధస్సుకు శ్రీకారం
భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు నిలయాలు
మన పండుగలు
కొత్త ఆశలకు,ఊహలకు ఊపిరిపోస్తూ
రేపటి జీవిత వికాసాన్ని కాంక్షిస్తూ
కష్టాలను ఇష్టంగా ఎదుర్కొంటూ
ఒక్కో వర్షంకు ఒక్కో ప్రత్యేక పేరుతో
అందులోనే మన జీవన శైలి నిలిచేలా
భవిష్యత్ ని చెప్పకనే చెబుతుంది
మన ఉగాది పండుగ
హామీ పత్రం
ఈ రచన నా స్వీయ రచన. అనుకరణ కాదు