తానా కవితాలహరి” కి ప్రత్యేక అతిథి

ఆచార్య ఎం. రామనాథం నాయుడు

“తానా కవితాలహరి” కి ప్రత్యేక అతిథి – ఆచార్య ఎం. రామనాథం నాయుడు

భారతదేశ వజ్రోత్సవ వేడుకల సందర్భంగా తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో “కవితాలహరి” జరుపుతూ ప్రారంభ సభకు ప్రత్యేక అతిథిగా ఆచార్య ఎం. రామనాథం నాయుడు, తెలుగు శాఖాధిపతి, కవి, రచయిత, విమర్శకులు అయిన వారిని ఆహ్వానించడం ముదావాహం.

ప్రతిష్టాత్మకమైన ఉత్తర అమెరికా తెలుగు సంఘం వారు అంతర్జాతీయ కవి సమ్మేళనాన్ని ఏర్పాటు చేయడం, అందులో ఆచార్య ఎం. రామనాథం నాయుడు గారిని అంతర్జాతీయంగా ప్రతేక అతిథిగా పరిచయం చేస్తున్నందుకు తానా అధ్యక్షులు శ్రీ అంజయ్య చౌదరి లావు గారికి, తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయ కర్త శ్రీ చిగురుమళ్ళ శ్రీనివాస్ గారికి, నిర్వహకులు డా” ప్రసాద్ తోటకూర గారికి ఆచార్య ఎం. రామనాథం నాయుడు గారు ధన్యవాదాలు తెలిపారు.

కన్నడ నాట రాచనగరిగా ఖ్యాతి గడించిన మైసూరు మహా నగరంలోని కర్నాటక రాష్ట్ర సార్వత్రిక విశ్వవిద్యాలయం లో తెలుగు ఆచార్యులుగా, శాఖాధిపతిగా వున్న మొగరాల రామనాథం నాయుడు గారు ఎంతో మంది విద్యార్థులకు తెలుగు భాషను బోధిస్తూ, తెలుగులో పరిశోధనలు చేయిస్తూ, ఎన్నో జాతీయ, అంతర్జాతీయ సదస్సులను నిర్వహిస్తుా, ప్రాదేశిక నిర్దేశకులు గానూ, ఉపకులసచివులు గానూ ఉత్తమ సేవలను అందించారు. పది విలువైన తెలుగు పుస్తకాలను రాశారు. 80 వ్యాసాలను వివిధ పత్రికల్లో ముద్రించారు. 120 జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో పాల్గొని సమావేశాల అధ్యక్షులు గానూ, పత్రసమర్పకులు గానూ మంచి ఖ్యాతి గడించారు. ఈయన సేవలను గుర్తించి పలు సాహితీ సంస్థలు పురస్కారాలను అందించారు.

తానా వారు ఆచార్య ఎం. రామనాథం నాయుడు గారిని కవితాలహరి ప్రారంభ సభకు ప్రత్యేక అతిథిగా ఆహ్వానించడంపై తెలుగు విద్యార్థులు, పరిశోధకులు, స్నేహితులు, సాహితీ ప్రియులు, పెద్దలు వారిని అభినందించారు.

Get real time updates directly on you device, subscribe now.