శీర్షిక:- *సిరి చందనాలు*
సిరి చందనాల నవ్వులు వెదజల్లి
మదిగిల్లకే అలా నాగ మల్లి
నిండు పున్నమి రేయిలో
జంటపక్షి కై వేచిన చంద్ర చకోరి
వలపు వాకిట నాకై వేచి నిలచిన
చిలిపి జాబిలి
కీరముల కిలకిలా రావాలకే
తుళ్ళిపడే లలితకోమలి
పట్టు చీర పట్టబోతే..
పాదరసమల్లే పట్టు జారిపోకే….అలా
రసరమ్య రాగాల రంగేళి
నా మనసున మంజీర నాదమాలపించితివే
చురుకు కన్నుల సౌదామిని
నీ పలుకులలో సిరి వెన్నెల చల్లదనం
ప్రియమారా నీవు నన్ను పిలిచేటి వేళలో..
ప్రియా నీ ప్రేమలో అమ్మ ఒడి వెచ్చదనం
మరువ గలనా…. చెలి ! నయగారాల
ఓ….నా పదకేళి!!
*ఇది నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను*
సిరిపురపు నాగలక్ష్మి
కలం పేరు: సిరి
తెలుగు ఉపాధ్యాయిని
మహాత్మా జ్యోతిబా పూలే గురుకులం శ్రీశైలం
🌹సిరి🌹