ఓ ముగింపు లేని కథ……. LRS

రచన ఎల్ ఆర్ ఎస్ LRS

D,09
“ఓ ముగింపు లేని కథ”

ఓ అద్భుతం !తొలుసూరి కాన్పులో శిశువు జన్మించక ముందే “భరోసా”ఆనందోత్సాహాలలో కన్నోళ్ళను ముంచేసింది !
రాత్రాంత పురిటినొప్పులతో తల్లడిల్లి
తెల్లవారక ముందే శిశువుకు జన్మనిచ్చిన తల్లి సమ్మక్క తన పుట్టింటి ఇలవేల్పు సమ్మక్క దేవత పూనం రాగనే
శిశువుకు “పులి గండం ”
‌రాబోయేది తెలిపింది, లోకం నమ్మలేని నిజం,దేవత సత్య వాక్కు నిజమైంది!
ఏడేండ్ల ప్రాయంలో బడి పిల్లలతో వెళ్ళి
సర్కస్ చూస్తున్నంతలో బాలున్ని
చివరి క్షణంలో బోనులోకి లాక్కొని కుడిచేతి పులి నోటితో నములుతూ పంజాతో కొట్టిన దెబ్బలకు రక్తసిక్తమైన దేహంతో రెండురోజులుగామృత్యువుతో పొరాడి మరణాన్ని జయించి మరో జన్మమెత్తి పులి 🐯 రాజైయాడు!
సమ్మక్క.వీరశౌర్య స్ఫూర్తినిచ్చే
ఆత్మ విశ్వాసంతో బళ్ళొఎడమచేతితోమళ్ళీ అక్షరాలు దిద్దుతు భవిష్యత్తుకు బాటలేసేంతలో
కుల, దివ్యాంగ వివక్షతలతో పసిహృదయం పాశనంలా చదువు సమరంలా సాగిస్తూ,,! అధిగమిస్తూ
సంఘర్షణలతో బాల్యం మొదలైంది!
ఎన్నోమరెన్నో మలుపులు జీవితంలో వస్తూ పోతూ గమ్యం తెలియని బాల్యం అసహాయ స్థితిలో మనోనిర్భరంతో ఏకగ్రత సాహసం సంఘీభావం విశ్వాసం నిజాయితీ ఆత్మరక్షణ విద్యలు అధ్యయనం ఆధ్యాత్మికత సాహితీ కళా సామాజిక చైతన్య పరిజ్ఞాన స్పృహ అలవర్చుకోని జీవితాశయంతో ఎదిగి ఒంటి రెక్క కార్యకర్తగా తోటివాళ్ళఅభ్యున్నతికి సంఘపరంగా కృషి చేస్తూ రచనలు సాగిస్తూ ఉద్యోగిగా కుటుంబ పెద్దగా బాధ్యతలతో! ఆర్థిక ఇబ్బందులతో శారీరక లోపంతో అనారోగ్యంతో అష్ట కాష్టాలకు లోనైనా, సమయస్పూర్తితో ప్రతిభ కనబరిచి ఆత్మీయప్రశంసలను సన్మాన సత్కారాలను ప్రముఖులచే అందుకున్న””ఆరు దశాబ్దాల జీవితం”” ‌ఓ అద్భుత మహాప్రస్థానం ఓ ముగింపు లేని కథలో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ బాటలో దళిత దివ్యాంగ విద్యార్థి యోధుడై సాగాడు

_ఎల్లారెస్