వి ఆర్ ఏ ల నిరవధిక సమ్మె పట్టించుకోని ప్రభుత్వం, కలెక్టర్

పట్టించుకోని తెలంగాణ ప్రభుత్వం, నిర్మల్ లో దారుణం

పట్టించుకోని తెలంగాణ ప్రభుత్వం మరియు అధికారులు అలాగే జిల్లా కలెక్టర్

గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గారు నూతన భూ పరిపాలన చట్టం తీసుకొచ్చే సమయంలో (2020)నిండు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చినటువంటి హామీలు
1) పే – స్కేల్ అమలు చేస్తానని చెప్పాడు.
2) అర్హులైన VRA లకు ప్రమోషన్స్ ఇస్తానని,
3) వయసు పైబడిన VRA ల కుటుంబంలోని వారికి వారసత్వ ఉద్యోగం ఇస్తానని చెప్పడం జరిగింది.
ఈ హామీలిచ్చి రెండు సంవత్సారాలు గడుస్తున్న నిమ్మకు నీరెత్తినట్లు ప్రభుత్వం వ్యవహరించడం హేయమైన చర్యగా మేము (VRA లము) చూస్తున్నాం. దీనిని ఐక్యంగా కలిసి పోరాటం చేయాలని నిర్ణయించి ఒక రాష్ట్రస్థాయి JAC ని ఏర్పాటు చేసి గత నెల (జూలై) 25 వ తేదీ నుంచి నిరవదిక సమ్మే చేస్తున్నాం అందులో బాగంగా ఈ నెల (ఆగస్టు) 25 మరియు 26 వ తేదీలలో “మహాధర్నా – వంట వార్పు” 48 గంటల పాటు నిర్మల్ జిల్లా కలెక్టరు కార్యాలయాల ఎదుట నిర్వహిస్తున్నరు.


తెలంగాణ వచ్చినా మా బతుకులు మారలేదు