అంబటి మనస్సు

మనసు లోతెంతో తెలుసా ”

ఈ మనసు ఎప్పుడూ..
ఏదో ప్రశ్నలవర్షం కురిపిస్తూ ఉంటుంది!!…
ఒక్కొక్క ప్రశ్న ఒక్కోతూటా!!….
బతుకు బాధల మీద ప్రశ్న!!…
మానవ సమాజం మీద ప్రశ్న!!…
ఈ వ్యవస్థ..అవస్థల మీద ప్రశ్న!!…
ఈ లోకం పోకడ మీద ప్రశ్న!!…
మనుషుల వ్యక్తిత్వం మీద ప్రశ్న!!…
ఊహల కందని ప్రశ్నలు వేసి
ఊపిరి తీస్తోంది మనసు!!…

ప్రశ్నలను దాటేసి పోలేక!!…
హద్దులు దాటలేక!!…
ఎవరు అబద్ధాలు చెప్పలేక!!…
తగువు పడలేక తెగువ చూపలేక!!…
కుమిలి నలిగి పోతుంటారు!!…

ఇది కల్లోల లోకం..కలతలు ఎక్కువే!!…
కోరికలెక్కువ..హద్దు మీరుతుంటాయి..
మొండితనమెక్కువ!!…
మోసపోవడం ఎక్కువ!!…
మోసగించడం కూడా ఎక్కువే!!…

నాటినుంచి నేటివరకు…
ఏ ప్రశ్నలకూ జవాబు దొరుకుటలేదు!!..
నిత్యం దోషిలా నిలబడుతున్నారు!!…
ఆత్మసాక్షిని అడుగుతున్నారు!!…
అహం వదిలితే…
అంతరాత్మ చెబుతుందని!!…
ద్వేషం..మోసం వదిలితేనే
జవాబు వస్తుందని!!…

మనసు గర్భంలో ప్రశ్నల సెలయేళ్లే!!…
ఎన్నెన్నో జలధారల్లా ఊరుతుంటాయి!!..
ఈ ప్రశ్నలే మానవ సమాజానికి మార్పు..
అందరినీ జాగృతపరిచే దారులు!!…
సౌభ్రాతృత్వానికి సానుకూలత!!…
మానవ మనుగడకు ప్రశ్నలే ఆధారం!!…

సమాజంలోని ప్రతి వ్యక్తీ…
మనుషుల్లో తలెత్తే ప్రశ్నలకు…
జవాబు వెతుక్కొంటే…
జీవితం సుఖమయమే!!….

అంతామన చేతుల్లోనే ఉంది!!…
అంతామన మనసులోనే ఉంది!!…
మార్పు రావాలంటే…
మనసుమాట వినాలి!!…

మనిషి ఎప్పుడు ఏదో
అర్థంకాని ఆవేదనలోనూ…
అంతులేని బరువును మోస్తుంటాడు!!
తెలియని వ్యసనాలు
ఎన్నెన్ని దాగిఉన్నవో!!…
ప్రశ్నలన్నీ దాడి చేసిన్నప్పుడు…
మనిషి ఎక్కడో…
ఒక దగ్గర కూలిపోతాడు!!…

మనసు లోతెంతో…
ఎవరికీ తెలియదు!!…
గుండె విశాలమెంతో కూడా…
మరెవరికీ తెలియదు…
లెక్కలేవీ తెలియకుండానే…
అందరికీ లక్కు రావాలంటే ఎలా…
అందుకే మనసు వేసే ప్రశ్నలకు
తప్పకుండా జవాబు వెతుక్కోవాలి!!….

అంబటి నారాయణ
నిర్మల్
9849326801