శీర్షిక: మాతృ దినోత్సవం
ప్రఖ్యాత దినపత్రిక “మదర్స్ డే సెలబ్రేషన్స్”ను న్యూ ఫేమస్ స్టార్ హోటల్లో నిర్వహిస్తుంది.ఎస్.ఎమ్.ఎస్. లద్వారా”మదర్స్” ని ఆహ్వానించింది. అమ్మ లందరూ…ఆ రోజు తమ పనులన్నీ త్వరగా ముగించుకుని వారిచ్చిన టైమ్ కి హాజరయ్యారు.ప్రముఖ కంపెనీలు తమ ప్రోడక్ట్స్ తో ” మదర్స్ డే ” ని”మనీ”డే గా మార్చుకునేందుకు మహిళలను అట్టహాసంగా ఆహ్వానించారు.ఈ’డే ‘ లన్ని ప్రముఖ కంపెనీల బిజినెస్ ప్రమోషన్ కోసం నిర్వహించే వేదికలని తెలియని ‘ శారద’ తను కూడా ఆ సెలబ్రేషన్స్ లో పాల్గోవాలని, తద్వారా తన కే మైనా సహాయ సహకారాలు అందుతాయి అని ఆశ గా వచ్చింది తెలిసిన వాళ్ళ ప్రోత్సాహం తో.
పిల్లలు చిన్నగా వున్నపుడే శారద భర్త పరారయ్యాడు.పుట్టింటి, అత్తింటి ఆదరణ లేక ఒంటరి
ఆడదై కష్ట పడి పిల్లల్ని పెంచి చదివిస్తుంది. ఇ లాంటి ఉత్సవాల్లో గతం లో ఎపుడూ పాల్గొన లేదు.బెదురు బెదురు గా ఫంక్షన్ హాల్లో కి అడుగు పెట్టింది శారద.నగరం నాలుగు మూలల నుండి మహిళలు పెళ్లికి వచ్చిన పేరంటాలు లా తయారైవచ్చారు.
శారద తను కట్టుకున్న నేతచీర,మెడలో పసుపు తాడు,చేతులకి మట్టిగాజులు చూసి కు ని చాలా చిన్న బోయింది. తాను ఖరీ దైన నగలు చీరలు ధరించలేదని కాదు. ఇలాంటి గొప్ప వాళ్ళ ఫంక్షన్ కి తనలాంటి పేద అమ్మలు రాకూడదని గిల్టీ గా ఫీలయింది.
సభ మొదలయింది.వివిధ రంగాల్లో ప్రముఖ మహిళలు అమ్మ యొక్క గొప్పతనాన్ని కొనియాడారు. తర్వాత ప్రముఖ కంపెనీలు తమ ప్రోడక్ట్స్ గురించి వివరించారు.మాతృ దినోత్సవ సందర్భంగా ఒకటి కొంటే మూడు ఉచితం మని అమ్మల్ని మెస్మరైజ్ చేసి సేల్స్ పెంచుకున్నారు.వచ్చిన మహిళలంతా ఎగువ మధ్య తరగతి వాళ్ళు.పోటీ పడి కంపెనీ ప్రొడక్ట్స్ ని కొనేశారు.వాటి ఉపయోగం గురించి పట్టంచుకో కుండా గుర్తింపు కోసం ఎగబడి కొన్నారు.ఆ కార్యక్రమాన్ని ఆశ్చర్యంగా చూస్తోంది శారద.ఎంతో పొదుపు చేసిన డబ్బు తో దారి ఖర్చులు పెట్టుకుని ఇక్కడకు రాగలిగింది.తన లాంటి పేదరాలు ఏం ఖరీదు చేయకలదు? ఇక్కడ జరుగుతున్న ది తన ఊహ కు అందనిది.పేద తల్లుల్ని వేదిక మీద కు ఆహ్వానించిపిల్లల్ని పెంచటానికి పడుతున్న కష్టాల్ని తెలుసుకుని ఎవరైనా సహాయం అందచేస్తారు అని ఊహించింది శారద. కాని మేనేజ్మెంట్ వారు”అమ్మలరా! ఈ ఒక్కరోజు ఆడి పాడి ఆనందించండి…ఎంజాయ్ ఈవరీ బాడీ. ..అంటున్నారు.
తనలాంటి వారు ఎలా ఎంజాయ్ చేస్తారు.ఎన్నో ఆర్థిక ,సామాజిక ఒడిదుడుకులను అధిగమించి ఒంటరిగా పిల్లలకు చడువుసంద్యలు నేర్పించి ప్రయోజకులు గా తీర్చిదిద్ద టం లోనే నా జీవితం గడచి పోతుంది.అని తనలో తాను అనుకుంటుంది శారద.
సెలబ్రేషన్స్ లో గేమ్స్ రౌండ్ కండక్ట్ చేస్తున్నారు.ఫస్ట్ రౌండ్ తనకి తెలిసినట్టు రాసి ఇచ్చింది.శారద టెన్త్ క్లాస్ 90% మార్క్స్ తో పాస్ఐయింది.ఇంటర్ లో ఉండగా వారి బాధ్యత తీర్చుకున్నారు ఆమె తల్లదండ్రులు.అత్త ఇంటి లో అత్తమామలు,భర్త పెట్టే ఆరడులతో తను చదువు కున్నానన్న సంగతే మరిచింది.భర్త పరారైన తర్వాత పిల్లల్ని పెంచటానికి మిషన్ కుట్టి,పచ్చళ్ళు పట్టి,పిండివంటలు సప్లై చేయటం లో తనకున్న విద్య విజ్ఞానాన్ని దాదాపుగా మర్చిపోయింది.పూర్తిగా తన కష్టానికి ఆర్థిక సంపాదనకు అంకితం అయింది.శారద.
ఎలాగో ఫస్ట్ రౌండ్ లో విజయం సాధించింది. జెనరల్ నాలెడ్జ్ తో కూడా డబ్బు సంపాదించవచ్చు అన్న సత్యాన్ని ఈ గేమ్స్ తెలియచేస్తున్నాయి. రెండో రౌండ్ సినిమా రౌండ్.ఎపుడైనా కనీసం నెలకో సారి గుడి కి వెళ్ళ టమే తప్ప సంవత్సరానికి ఒకసారైనా సినిమాకు వెళ్ళాదు. సినిమా అనే వినోదం ఆమెకు తెలియదు. ఈ రోజుల్లో కూడా ఆమె ఇంట్లో టి.వి.లేదు.పిల్లలు కూడా తల్లి పరిస్థితి తెలిసి ఏ కోరికలు కోరరు.కడుపు కి తిండి,చదువు,నిద్ర,ఒంటికి బట్ట ఇవే వారి నిత్యావసరాలు.
ఆకలి కి ఇంత తినటం మాత్రమే తెలిసిన శారద ఏ కూరలో ఏ విటమిన్ వుందో తెలుసుకుని తినేటంత స్థోమత లే దు. పౌష్టికాహారం తినండి….రోజుకు ఐ దు రకాల పళ్ళు ,రెండు రకాల ఆకుకూరలు నట్స్ తినండి అని డాక్టర్స్ ఉచిత సలహా లు ఇచ్చేస్తా రు.. ప్రభుత్వం రోజు రోజు కి నిత్యావసరాల ధరలు పెంచేస్తుంటే ..కడుపునిండా తినటానికి నోచుకోని పేద ప్రజలకు …..మన పవిత్ర భారత దేశంలో… అన్నపూర్ణ అని పిలవబడే మన రాష్ట్రంలో ఇంక విటమిన్లు,పౌష్టికాహారం ఎక్కడ లభిస్తుంది.దేశం లోని ప్రతి పౌరుడికి తిండి,బట్ట,నివాసం,విద్య … ఇవాల్సిన ప్రభుత్వం నిత్యావసరాల ధరలు పెంచి బకాసురుడు లా ప్రజలను నంజుకు తింటుంటే ఏం తింటాం మనం. స్వతంత్రభారతావని73వసంతాలు జరుపుకున్నా …. రైల్వే స్టేషన్లో, బస్టాప్ లో బాగా దేవాలయాల వద్ద అడుక్కునే వాళ్ళ సంఖ్య తగ్గలేదు.దేశ అభివృద్ధి అంటే. ..ఆకలి చావులు లేకుండా నిత్యావసరాల ధరలు తగ్గించి అందరి కి ప్రాధమిక అవసరాలు సమకూర్చుతుందో అదే అభివృద్ధి చెందిన దేశం.
.. ముందుగా ప్రశ్న పత్రం తెలిసిన ప్రముఖుల భార్యా మణులు..”అమ్మ”టైటిల్ గెలుసుకున్నారు.నిజానికి వారు ఎపుడు పిల్లల ఆలనా పాలనా చూసింది లేదు.డబ్బులతో ఆయా లను పెట్టి… పెంచి… హాస్టల్లో ఉంచి చదివిస్తున్నారు. అలా పెరిగిన పిల్లలే తల్లిదండ్రులను వృద్ధాశ్రమం లో చేర్పిస్తున్నారు.మన పెద్దల సామెత”యధా రాజ…తథా ప్రజా”అన్నట్లుగా.అమ్మల ఆట పాటలతో ,కేరింతలు,
విజిల్స్ ,డాన్స్ ల తో అద్బుతం గా,ఆనందంగా అమ్మల ఉత్సవం ముగిసింది.
రోజంతా తమతో ఉన్న అమ్మలకు ఆర్గనైజ ర్స్ మసాలా లతో సత్కరించి సాగనంపారు.టం
భిన్న వదనంతో కూర్చున్న శారద ను పక్కావిడ పలకరించి, ఆమె సంసారం, పిల్లల బాధ్యతల గురించి తెలుసుకుంది.”మదర్స్ డే అంటే గేమ్స్ డే కాదని మీ లాంటి వారిని సన్మానించి,అభాగ్యూరాల్లైన అమ్మలను ఆర్థికంగా ఆదుకుంటేనే మదర్స్ డే కి అర్ధం “అంటూ యాంకర్ తో పొట్లా డింది.తను సాధారణ ఉ ద్యోగినని మేనేజ్మెంట్ వారితో మాట్లాడమని తప్పుకుంది యాంకరమ్మ. దగా పడిన శారద తనకిచ్చిన,తను తయారు చేసిన మసాలా పాకెట్స్ పట్టుకుని నిరాశ, నిసృహలతో వెనుతిరిగింది.
తలుపు తీసి ఆనందంగా ఎదురు వచ్చారు పిల్లలు.చిన్నబోయిన వదనం తో ఉన్న తల్లి ని వారు కంగ్రాట్స్ అంటూ అభినందించారు”.ఏం సాధించానని నాకు కంగ్రాట్స్ ” అంటూ ఫీలైంది శార ద.
“తల్లి గా నువ్ సాధించాల్సింది. సా దించావమ్మా”అన్నారు పిల్లలు.”ఏ మిటి…మదర్స్ డే కి వెళ్ళటమా” నీరసంగా నవ్వింది శారద.
తల్లి ని కుర్చీ లో కూర్చోపెట్టి ఆమె ను కళ్ళు మూసుకోమని చెప్పి ఆమె చేతుల్లో కొన్ని కాగితాలు పెట్టా రు… పిల్ల లు.అవి ఉద్యోగపు కాల్ లెటర్స్ అని తెలుసు కుని శారద ఉప్పొంగి పోయింది.తల్లి మెడలో తాము దాచుకున్న స్కాల ర షిప్ డబ్బులతో కొన్న పూలదండ ను వేసి స్వీట్ పాకెట్ ఆమె చేతిలో ఉంచి స్వీట్ తినిపించారు పిల్లలు.
“అమ్మా నీ కష్టం ఫలించి మేం
ప్రయోజకులమయ్యాం…మా ఇద్దరికీ ఉద్యోగాలు వచ్చాయి.మన కష్టాలు గట్టెక్కాయి.”అంటూ చెప్పారు.
తన శ్రమను గుర్తించి సత్కరించ లేదని మదర్స్ డే సెలబ్రేట్ చేసిన యాజమాన్యాన్ని తూలనాడాను.భగవంతుడు నా శ్రమను గుర్తించి నా బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇచ్చాడు.ఇంతకు మించిన మా తృదినో త్స్ వ సత్కారం ఏముంటుంది తల్లికి.
చేతు లె త్తి ఆ దేవుడికి నమస్కరించింది శారద.
“అందుకో అమ్మా నీ పిల్లలు నీ కిచ్చే సత్కారం..,,”అంటూ పిల్లలు ఆనందం తో అభినందించారు.ఏ తల్లి కైనా ఇంతకన్నా కావాల్సింది ఏముంటుంది.అదే నిజమైన మాతృ దినోత్సవం.
పేరు శ్రీమతి సత్య మొం డ్రెటి
ఊరు హైదరాబాద్
హామీ పత్రం ఈ కథ నా స్వీయ రచన దీనికి అనువాదం అనుసరణ కాదు కాఫీ చేయబడలేదు అని హామీ ఇస్తున్నాను.