నేడు ప్రభుత్వ డిగ్రీ కళాశాల అతిథి అధ్యాపకులు నిర్మల్, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారిని కలిసి సమస్యల ను తీర్చుమని కోరారు గెస్ట్లను కాంట్రాక్టు అధ్యాపకులుగా ప్రమోట్ చేయాలి అని కోరారు.
రాష్ట్రవ్యాప్తంగా వున్నా డిగ్రీ కళాశాలల యందు అతిథి అధ్యాపకులు 1905 మంది పనిచేస్తున్నారు వీరికి నెలా నెలా జీతం రాదు, అన్ని నెలల్లో పూర్తిగా జీతం రాదు. అంటే 12 మాసాలకు జీతం రాదు,కూలీ వ్యవస్థ ఇది ఈరోజు హాజరు ఉంటే ఆ రోజు జీతం వేలి ముద్రలు పడితే వస్తది అది కూడా ఒక పిరియడ్ కు యూజీసీ ప్రకారం 500 చెల్లించాలి కానీ 390 ఇస్తారు. ఒక నెలలో 18 పని దినాలు రాకపోతే జీతంలో కోత విధిస్తారు. ప్రభుత్వ సెలవులు వస్తే కూలీ కట్టియ్యరు. నెల కింత అని జీతం రాదు. ఎప్పుడో బడ్జెట్ వస్తే వస్తది. 6నెల్లకో యాడాదికో, నెలకు ఒక సెలవు కూడా అంటే cl ఉండదు. నియమం ప్రకారం తరగతులు చెప్పుకొని కళాశాలను వదిలి బయటకు వెళ్ళాలి కానీ పొద్దున 10 వోతే 4.30 దాకా కాలేజీలో ఉండాలే. రికార్డులు అన్నీ అతిథులు రాయాల్సి ఉంటది. వార్షిక నమోదు లన్నీ వీళ్ళే చేసుకోవాలి. పని మాత్రం చేస్తుండ్రు కానీ దానికి తగిన సమాన వేతనం అందడం లేదు. విద్యార్థులకు పరీక్షలు వస్తే అతిథులకు జీతం ఉండదు. ఏ విధంగా చూసిన ఆర్థిక దోపిడీకి గురి అవుతున్నారు. ఒక నెలలో తరగతుల వారీగా 72 పిరియడ్స్ వస్తేనే దానికి తగిన కొంత వేతనం వస్తుంది. ఉద్యోగ భద్రత లేకపోవడం,ఇలా అనేక మైన సమస్యలు అతిథి అధ్యాపకులు అనుభవిస్తున్నారు. అందుకే మా అవస్థల గురించి ఆలోచించి పనికి సమాన వేతనం ఇప్పించండి. తరగతుల వారిగా కాకుండా నెల జీతం ఇవ్వాలి, నెలనెలా జీతం ఇవ్వాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. మా సమస్యలు తీర్చుమని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిని అతిథి అధ్యాపకులు కలిశారు.
ఈ కార్యక్రమం లో రవీందర్, అర్గుల నరేందర్, అల్లూరి తిరుపతి రెడ్డి, షహిస్తా , డాక్టర్ ఎల్మల రంజిత్ కుమార్, కొంతం మురలీధర్ , రేవెళ్ల దీలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు