సాహితీ ప్రక్రియలకు ఆద్యుడు డాక్టర్ ఎల్మల రంజిత్ కుమార్

ISBN

1995 లో పదవతరగతి అనంతరం ఒక సామాన్య సగటు విద్యార్ధి సాధించిన ఘనత ఇది. తెలంగాణ లోనే తెలుగు సాహితీ ప్రక్రియలకు అద్యుడు డాక్టర్ ఎల్మల రంజిత్ కుమార్, ఏకంగా 55 సాహితీ ప్రక్రియలకు పురుడు పోసిన సాహితీ వేత్త వివారాల్లోకి వెళ్తే. ఆయన ఒక ఒక సాధారణ గురువుగారి పుత్ర రత్నం. ఈయన తల్లి దండ్రులు సుశీల, ముత్తన్న, వీరి స్వస్థలం నిర్మల్. ఇతను బాల్యం అంతా ఓ మారుమూల గ్రామమైన జైనథ్ లో 6వ తరగతి వరకు చదువుకున్నడు, 10వ తరగతి ఇచ్చోడలో చదువుకున్న రోజుల్లో కొత్త ఛందస్సు ను కనుగొని నేడు ఛందో రంజీతము అనే గొప్ప లాక్షణిక గ్రంథాన్ని తెలుగు సాహితీ లోకానికి అందించారు. అంతే కాకుండా ఆదిలాబాద్ జిల్లా తెలుగు సాహిత్య చరిత్ర అనే అంశం పై ప్రతిష్టాత్మక మైన ఉస్మానియా విశ్వ విద్యాలయంలో పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా కూడా అందుకున్నారు. తాను కనుగొన్న దేశీ ఛందస్సును పలుగురు విద్యార్థులకు నేర్పి పద్యం యొక్క ఉన్నతిని విశ్వ వ్యాప్తం చేశారు. పాల్కురి సోమనాథుని తర్వాత దేశీ ఛందస్సు ను విరివిగా వాడిన కవి ఇతను. 10 శతకాల వరకు రచించారు. ఆ శతకాలు అన్నీ కూడా కొత్త ఛందస్సులో కొత్త ప్రక్రియ లో రాసినవే. ఇతను సాధించిన ఈ విజయం సాహితీ లోకానికే కనివిప్పు కలిగించే పథం. నూతన సాహితీ ప్రక్రియలకు కొత్త ఊపు నిచ్చింది. ఇతను కొత్త కవులకు మార్గదర్శకుడయ్యాడు. ఆధునిక దేశీ ఛందస్సుకు ఆద్యుడయ్యాడై నిలిచాడు. ప్రస్తుతం ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మల్ లో తెలుగు అధ్యాపకులుగా విధులు నిర్వహిస్తున్నారు.