వినదగు ఎవరు చెప్పినా

సమదర్శిని ఐ ఎస్ బి ఎన్ కవితా సమూహం
అంశం వినదగు ఎవరు చెప్పినా
రచన యడ్ల శ్రీనివాసరావు
ఊరు విజయనగరం

పెద్దలు చెప్పిన మాటలు చద్దన్న మూట
పిల్లలు పలికిన పలుకులు
కోటలు పేటలు ఎగిసే
చెప్పినది వినడం ధర్మం
మంచిని ఆస్వాదించడం న్యాయం
చెడు దారిలో నడవకూడదు
చెడు మాటలు వినకూడదు
వినినా వాటిని పాటించరాదు
పాటిస్తే అది మన కర్మ
జీవితమంతా ఎడాల్సిందే
గొప్పవారి మాటలు లెక్కపెట్టు
గొప్పగా జీవితం సాగించు
మంచితనం మన పెన్నిధి
చెప్పింది వినడం దైవ సన్నిధి
మన కష్టాన్ని దేవుడికి చెప్పాలి
బాధను దిగమింగక ఉండాలి
పెద్ద గోల పెట్టి మైక్ లో వద్దు
దేవుడికి చెవుడు లేదు
దేవుని తలచితి మంచి జరుగు
దైవం మాట వింటే శుభం జరుగు.
—————————————-
హామీ పత్రం
ఈ రచన నా యొక్క సొంత రచన
ఇట్లు
యడ్ల శ్రీనివాసరావు విజయనగరం