విద్యార్థులే శాస్త్ర వేత్తలుగా ఎదగాలి* డాక్టర్ వెల్మల మధు

*విద్యార్థులే శాస్త్ర వేత్తలుగా ఎదగాలి*

నేడు నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వృక్ష శాస్త్ర విభాగం లో డాక్టర్ వెల్మల మధు అసోసియేట్ ప్రొపెసర్ గారు ఆర్ డి ఎన్ ఏ సాంకేతిక అనే అంశం పై విస్తృత ఉపన్యాసం ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ యువత శాస్త్రవేత్తలుగా ఎదగాలి అని అన్నారు. ప్రస్తుత ప్రపంచంలో జీవ సాంకేతిక శాస్త్రం సమాజానికి చాలా చాలా ఉపయోగ పడుతుందని. ఇంకా అనేకమైన మంచి మార్పులు జరిగి మానవాళికి సర్వ జీవ సాంకేతిక అభివృద్ధి జరుగ వలసి వుంది అందుకోసం విద్యార్థులు జీవ సాంకేతిక శాస్త్రవేత్తలు అవ్వాలని విద్యార్థులకు సూచించారు.


జన్యు మార్పిడి మొక్కలు మరియు జంతువులు మనకు నిత్య జీవితంలో ఏ విధంగా ఉపయోగ పడుతున్నాయో అలాగే మనం వాటిని మన మనుగడకోసం ఎలా ఉపాయోగించు కోవాలో పూర్తి అవగాహన కల్పించారు.


ఈ కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపాల్ డా జె భీంరావు, ఎస్ పవన్ కుమార్ , ఏ నరేందర్, డా అరుణ్ కుమార్ ఐ క్యూ ఏ సి కో ఆర్డినేటర్ , డా పీజీ రెడ్డి, డా ఎల్మల రంజిత్ కుమార్, బింగివార్ శ్రీనివాస్ గారు తదితరులు పాల్గొన్నారు .