**అవతారమ్మున కొక ఆహార్యం**
అవతారమ్మనకొక ఆహార్యం,
అవతారమ్మునకొక ఆయుధం,
ఇదియే దశ అవతారాల వైశిష్ట్యం..
భూ భారము మోసేందుకు, జలధిని ఈదేందుకు,
శరీర ఆకృతిని మలచుకొనె,
వామన రూపమున ఛత్రము ధరియించె,
వాడి ఐన గోళ్ళతో నర మృగరూపు దాల్చే,
పరశురాముడై గొడ్డలి చే బూని నాడు…
కోదండ రాముడై అసురుల దునుమాడె,
నాగలిపట్టి భూమిని సశ్య శ్యామలం గావించె బల రాముడై
వేణువూది అందరి సమ్మోహనపరచినాడుశ్రీకృష్ణుడై
గుర్రము నెక్కి ఖడ్గధారియై
కల్కి రూపము దాల్చినాడు.
అన్నిటి ఆంతర్యం ధర్మ పరి రక్షణ ఒక్కటే..
చెరుకుపల్లి గాంగేయ శాస్త్రి, రాజమండ్రి