రండి..మా పదాల తోటలోకి”

రండి..మా పదాల తోటలోకి”

ఒక్కసారి మా పదాల తోటలోకి రండి!!..
భావాల ఊటను చూడండి!!…
అనేక రకాల పరిమళాలతో పారుతుంది
అభివృద్ధిని కోరే అభ్యుదయ పదాలు…
మార్పును కోరే విప్లవ పదాలు…
అనుకున్నది అందించే ఉద్యమ పదాలు..
ఉల్లాసాన్ని కలిగించే ఉషోదయ పదాలు..
అన్ని సంబంధాలను ఆత్మీయంగా
కలిపే పదాలు కూడా ఉన్నాయి!!…

ఇంకిపోతున్న మానవీయతను…
కుంగి పోతున్న మానవత్వాన్ని…
చైతన్యాన్ని ఇచ్చి నిలబెట్టే పదాలున్నాయి!!…
కొత్త కొత్త చైతన్యం చిగురుతో
పరిమళిస్తున్న పదాలు చాలా ఉన్నాయి..
అబ్బురపరిచే అద్భుతమైన పాదాలు ఎన్నెన్నో!!??….

అలంకారాలతో అలరించే పదాలు…
రంగులతో, సీతాకోక చిలుక పొంగులతో
స్పష్టత కలిగిన పదాలు…
నడుస్తున్న కాలానికి తగ్గ పదాలెన్నో!!??

అన్నిటినీ త్యజించి మా తోటలోకి రండి..
సుందర సుకుమార అమాయక పదాలను చూడొచ్చు!!…
మీ హృదయాన్ని తాకి స్పర్శిస్తే జీవితం ధన్యం!!…

స్వేచ్ఛలేని చెరలో నుంచి తరలిరండి!!..
స్వచ్చమైన స్వేచ్ఛతో
మనసుకు ప్రశాంతత నిస్తుంది…
మీకు మీరు బంధించుకున్న సంకెళ్లను తెంపుకొండి!!…
ఆధిపత్యం లేని అద్వితీయమైన తోటలోకి రండి!!…
మీ ఉరుకుల పరుగుల జీవితాన్ని వదలిరండి!!…
ఇది పరిమళించే పదాల దండకారణ్యం..

పాత విశ్వాసాన్ని వదిలేయండి!!…
కొత్త విశ్వాసంతో తోటలోకి రండి!!…
మీ బతుకుకు భరోసానిచ్చే స్ఫూర్తిని అందిస్తుంది…
చిగురిస్తున్న పరిమళాల పూలవనాలెన్నో
గతానుభవాల గాలులు వీస్తున్నాయి..
మట్టిని పరిమళింప చేసే పదాలు కనబడుతాయి…
అమిత ప్రేమతో అక్కున చేర్చుకుంటాయి
పదాలు లయబద్దంగా చప్పుడు చేస్తాయి
అంతర్ముఖ పదాలు ఆనందానిస్తాయి..
బహిర్ముఖ పదాలు ఉనికిని కాపాడుతాయి…
వివిధ సంస్కృతుల పదాలు
ఎప్పటికీ అస్తమించని విస్తరించే పదాలు
ఈ తోటనిండా ఉన్నాయి..

రెమ్మరెమ్మకు ఓ స్వరం కొమ్మకొమ్మకో రాగం…
పదాలన్నీ తోరణాలై స్వాగతిస్తాయి…
నిజాల్ని నిర్ధారించే నిఖార్సైన పదాలెన్నో!
ఒక్కొక్క పదాన్ని పట్టుకొని
మునివేళ్ళతో మృదువుగా తాకండి!!…
పరవశించి మీ మనసులోకి పోయి
మమకారంతో మరులు గొలుపుతాయి..
మీలోని తిమిరంపై సమరం సాగిస్తాయి..
ఇక్కడ మనోజ్ఞ సౌందర్యాలతో..
సేద్యంలేని ఎవరికీ సాధ్యంకాని పదాలు
ఈ తోటలో పండుతాయి…
రండి!!…మా పదాల తోటలోకి!!…

అంబటి నారాయణ
నిర్మల్
9849326801

Comments (0)
Add Comment