నేను… నాకు మరణం లేదు

అవును మీరు విన్నది నిజమే
నేను… మీతో మాట్లాడుతున్నాను
నాకు మరణం లేదు రాదు అసాధ్యం అది
నాకు ఎన్నో శరీరాలు
మొక్కలు పువ్వులు పురుగులు
జంతువులు
ఇప్పుడే నేను మనీషిని
నాకు ఎన్నో అనుభవాలు
అవమానాలు అయినా ఆ
అంబేద్కర్ అడుగు జాడలో
అనంత పయనం చేస్తున్నాను
జ్ఞాన పీఠం యెక్కి గమ్యం చేరుకున్నాను
నాకు ఎన్నో జ్ఞాపకాలు
ఆజన్మ నుంచి ఈ జన్మల వరకు
నాలో ఎన్నో ప్రశ్నలు
నాలో ఎన్నో సమాధానాలు
నీనున్నది ఎప్పుడు ధైర్యంగానే
నేను నీకు తోడు నీడ
నన్ను వెతుక్కుంటూ వచ్చిన
చీకటికి దొరికి పోయాను కానీ
నేను ఇంకా వెలుగులోనే వున్నాను
నాలో నాతో ఎన్నో ప్రయాణాలు
నాకోసం వెలుగు కాచుకొనే వుంది
నన్ను వేడిగా తాకింది
నాలో అప్పటికే వున్నా
నమ్మకాలకు కొత్త చిగురులందించింది
నా ఉనికిని లోకానికి చాటింది
నాలో ఎన్నో క్షణాలు
నన్ను ఒక దారిలో నడిపించాయి
నేను తప్పటడుగులు వేసాను కానీ
తప్పి అడుగులు వేయలేక పోయాను
నాలో మౌనం ఎప్పుడు ఉండేదే
అప్పుడప్పుడు ప్రళయం సంభవించేది
నాకు ప్రతీక్షణం ఓటమి ఎదురైనా
పట్టుదలతో కొన్ని తడిమి చూసాను
నేను కారణాలను వెతుకలేదు
నాకైతే సాకులు చెప్పడం తెలియదు
నా శరీరాలు కన్నీళ్లు ప్రసాదించిన
నాకు నేను సర్దుకొని ఆనందంగా
ఉండగలిగాను వున్నాను
నాకు ఆది అంతం రెండే తెలుసు
నేను నేనుగా చరిత్ర పుటల్లో
చెదరని చరిత్ర రాసుకొన్నాను
నేను సూక్ష్మంలో మోక్షంలా
సరస్వతీ పార్వతి
శంకర నారాయణుల
దర్శనం దర్శించి కోరగా
నాకు మరణమ్ము లేదని తెలిపారు
ఈ కాయము కాలువేళకు మునుపే
జన సంద్రం పోటెత్తిన
అలలతో పోగయ్యేను
తోవలన్నీ పూలనదిలా సాగిపోయేను
లక్షణాలు కలిగిన నా లాక్షణికులు
నాకు శిష్యులు లక్షల్లో కదిలి
యువ తారగా దృవతారగా యెంచి
నా ఆత్మ ఘనత నలు దిశలు
మాటలాడు కొనునట్లు యువత
నవ మార్గంలో పయనించు నటుల
నాజాతి బిడ్డలు నను కొనియాడారు
ఈ జన్మ కారణము కార్యము
నెరవేర్చు కొని సర్వ రుణాలు
బంధాలు తెంచుకొని జీవన్ముక్తి తో
శత్రు సంహారం చేసి
విజయ గర్వం తో నా స్వామి లో
ఐక్యత అయ్యేదను

రచన : డాక్టర్ ఎల్మల రంజిత్ కుమార్