కవిత్వం ప్రజల పక్షం

కవిత్వం ప్రజల పక్షం వహించాలి….

కవులు అనాధికారశాసన కర్తలు, కవిత్వం ఒక సృజనాత్మక ప్రక్రియ… ప్రకృతిని, మానవ సంబధాల్ని బలియంగా, మానవీయంగా వ్యక్తం చేసేది ఒక కవిత్వం మాత్రమే! సృష్టిలో దృగ్గోచరమైన సౌందర్యాన్ని కవి మాత్రమే చూడగలడు, వ్యక్తం చేయగలడు. నిజమైన కవి ఎప్పుడు ప్రజల పక్షంగానే నిలుస్తాడు. ప్రజల గొంతుకగా కవిత్వం రాస్తాడు. ప్రజల్నినిత్యం చైతన్య పరుస్తాడు. తన పదునైన కవిత్వం తో రాజ్యాన్ని ప్రశ్నిస్తాడు.కవిత్వాన్ని దుఃఖం, ఆనందం, తాత్విక చింతనలతో మధు పాత్రలానింపుతాడు. కవి సత్యం వైపు నిలబడి కవిత్వాన్ని గానం చేస్తాడు. బాధాస్రష్టులగుండె చప్పుళ్లు తన అక్షరాల్లో ధ్వనింపజెస్తాడు. కవి అమరుడు అక్షరాన్ని దీపంగా మార్చి ఎన్నో దీపాలకు వెలుగులు పంచుతాడు. కవి క్రాంతదర్శి గొప్ప మానవీయ సమాజాన్ని స్వప్నిస్తాడు. కవి పోరాట యోధుడు సమాజానికి తనకు జరుగుతున్న సంఘర్షణ కు సాక్షిగా నిలుస్తాడు. నికారసైన అయిన కవి తుప్పు పట్టిన భావాలకు ప్రతినిధిగా ఉండజాలడు. ఒక్క అక్షరాన్ని కూడ కుకవిత్వానికి జోడించలేడు, మట్టి మనుషుల ప్రేమల్ని కావ్య వస్తువులకు అలంకారంగా ఆద్దుతాడు!మొండి గోడల సౌందర్యాన్ని సుందరంగా చిత్రికరిస్తాడు,గద్దిపరకలు చేసే గాలి నృత్యానికి పాటను వాయులీనంగా అల్లుతాడు, నల్లని రాళ్ళల్లో జీవనాన్ని అన్వేషిస్తాడు… నీలి గగనాన్ని త్రుంచి నల్లకలువకు కాటుకల ఆద్దుతాడు… కవి, రవి వీలుకాడా!రాత్రిని,చంద్రుణ్ణిరహస్యం గా మోసి సోయగాల ప్రేమికుడా…కవిత్వాన్ని రాయలంటే పదాల్ని, భావాల్ని అరువు తెచ్చుకోకు…నీ హృదయ కవాటంతెరువు అంతే!!. నీదికానీ అక్షరాన్ని చెక్కినప్పుడు కవిగా ఆ క్షణమే చచ్చినట్లు!నీవు చెక్కిన అక్షరాలు మసకబారినట్లు !! దుప్పట్లకోసమో, అవార్డుల కోసమో, ప్రసంశా పత్రాలకోసమో, నగదుకోసమో కవిత్వం రాయకు… కఫన్లు, పైసలు, కాగితలు మరణించాక కూడ శవంపై చల్లుతారు…. కాన , కవిత్వం నిన్ను నీ లోపల అంత:సీమల్ని పలికించాలి… కవిత్వం కోసమే నీవు ఫినిక్స్ పక్షిలా మళ్ళీ మళ్ళీ పుట్టాలి!!
Dr తుమ్మల దేవరావ్, నిర్మల్ 8985742274
అంతర్జాతీయ కవితా దినోత్సవం సందర్బంగా..

Comments (0)
Add Comment