ధరణి సమయం

ఎర్త్ అవర్

“ప్రజలు ఏకం అవ్వండి ఇంటి కోసం”( unity for our one shared home) అనే నినాదంతో ఈ సంవత్సరం ఎర్త్ అవర్ మార్చి 23 రాత్రి 8:30 గం నుండి 9:30 గం వరకు ఉంటుంది .ఎర్త్ అవర్ అనగా ఒక గంట అన్ని రకాల లైట్లు ,ఫ్యాన్లు ,ఏసీలు ,కూలర్లు ఎలక్ట్రిక్ వస్తువులను ఆఫ్ చేసి ఉంచవలెను. కేవలం ఒక గంట భూమాతకు కేటాయించడం.
ఎర్త్ అవర్ మొదటగా 2007 నుండి ప్రారంభమైంది .భూమి మీద నివసించే ప్రజలు తమ ఇష్టంతో ,స్వచ్ఛందంగా ఒక పని గంట అన్ని రకాల ఎలక్ట్రిక్ వస్తువులను, లైట్లను స్విచ్ ఆఫ్ చేసి ఉండనిచ్చేవారు పర్యావరణ ప్రేమికులు . పర్యావరణ సమస్యలపై అవగాహన కల్పించేందుకు కృషి చేసేవారు పర్యావరణ ప్రేమికులు.
ముందుగా పారిస్ ఒప్పందంలో కర్బన ఉద్గారాలను తగ్గించడం తగ్గించి ,ప్రకృతిని కాపాడాలని ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది.
ప్రపంచవ్యాప్తంగా భావితరాలకు ప్రకృతిని ప్రసాదించాలంటే, నేటితరం ప్రజలు కొంత సమయమనం పాటించవలసి ఉంది . భూమి మీద జన్మించే ప్రతి ఒక్కరికి ఆరోగ్యవంతంగా జీవించే హక్కు ఉంది . అదేవిధంగా ప్రకృతి వనరులను ఉపయోగించుకునే హక్కు కూడా ఉంది .
అందుకోసం ,కర్బన ఉద్గారాలను తగ్గించే ప్రక్రియగా మొదలైంది ఈ ఎర్త్ అవర్. భూగ్రహం ఒక ఇల్లుగా భావించి “మన ఇంటి కోసం ఒక గంట” అనే నినాదంతో ఈ సంవత్సరం మీకోసం అతి పెద్ద అని పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్నారు.
2030 నాటికి భూష్ణోగ్రత 1.5డిగ్రీల సెల్సియస్ తగ్గించడానికి , ప్రతి ఒక్కరు కృషి చేయాలి. తమ ఇంటిని (భూ గ్రహాన్ని) రక్షించేందుకు స్వచ్ఛందంగా, ఒక గంట లైట్లు ఆఫ్ చేసి తమ వంతు బాధ్యతను నెరవేర్చాలి నెరవేర్చాలి.

విద్యా శశికాంత్
టీచర్
వరంగల్.

Comments (0)
Add Comment