నీరే ప్రాణం

నీరు మనకు జీవనాధారం . నీటి జాడతోనే జీవం మొదలవుతుంది. జీవరాశి మనుగడ కోసం అంతరిక్షన కూడా జలసాధన జరుగుతుంది .అనేక దేశాలు నీటి జాడ కనుగొనేందుకు అంతరిక్షంలో కూడా ప్రయత్నాలు సాగిస్తున్నాయి.
చెరువుల నుండి, బావుల నుండి, భూగర్భ జలాల నుండి, అదేవిధంగా హిమానీనదాలు నుండి వచ్చే నీరు తాగునీటికి సాగునీటికి అనుకూలం.
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నీటి వనరులు వనరుల లభ్యత లేదు , నీరు ముందు తరాలకు అందరిని ద్రాక్షగా మిగలడానికి సిద్ధంగా ఉన్న సహజ వనరు .
ఐస్లాండ్, గ్రీస్ , నార్వే ,డెన్మార్క్, నెదర్లాండ్స్ లాంటి కొన్ని దేశాలు దశాబ్దాల క్రితమే నీటి యొక్క ఆవశ్యకతను తెలుసుకొని నీటి వినియోగంలో మెలకువలు నేర్చుకొని ముందు వరుసలో నిలుచున్నాయి. వారి యొక్క దేశాభివృద్ధికి తోడ్పడుతున్నాయి. నీటి వినియోగం దేశాభివృద్ధికి తోడ్పడుతుందని ముందుగానే తెలుసుకున్నాయి.
వర్షపు నీటిని నిల్వ చేయడంలో మెలకువలు పెంపొందించుకుంటే మనం కూడా మిగతా దేశాల వలె నీటిని సద్వినియోగం చేసుకోవడంలో ముందు వరుసలో నిలుచుంటాము. అదేవిధంగా చెరువుల తవ్వించడం , బావులు తవ్వించడం ద్వారా కొంతవరకు నీటిని ఆధాచేయవచ్చు , నిల్వ చేయవచ్చు.
ముఖ్యంగా సాగునీటిలో మెలకువలు నేర్చుకుంటే తక్కువ నీటి వినియోగంపై అవగాహన, కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సాగునీటి సంక్షేమ పథకాల అమలు ద్వారా, సాగునీటిని యొక్క దుర్వినియోగాన్ని అరికట్టవచ్చు .
అదేవిధంగా పొరుగు దేశాలలో వినియోగిస్తున్న , సముద్ర నీటి నుండి ఉప్పును వేరు చేసే విధానం (డి సాలినేషన్ )అనగా” లవణ నిర్మూలన “పద్ధతిని పెంపొందించేలా చేయడం వల్ల సముద్ర నీటిని సైతం ఉపయోగించుకునే అవకాశం లభిస్తుంది .
భూగర్భ జలాల వినియోగాన్ని కట్టడి చేసే విధంగా అన్ని రాష్ట్రాలు ముందుకు రావాలి . భూగర్భంలో నీటి బావుల తవ్వకానికి పరిమితులు విధించాలి.
గృహవినియోగాలలో ఈ మధ్యకాలంలో ఏరేటర్లు నిర్మిస్తున్నారు. దీని వల్ల నీటి వినియోగం సగానికి పైగా తగ్గుతుంది. ప్రతి ఇంట్లో ఏరేటర్లు బిగించుకునే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. నీరు జీవనాధారం కాబట్టి నీటిని పొదుపుగా వాడుతూ భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి కనీస బాధ్యత.

విద్యా శశికాంత్
టీచర్
వరంగల్

Comments (0)
Add Comment