వ్యధా భరిత క్షుధ్భాద

వ్యధా భరిత క్షుధ్భాద

ప్రపంచంలో.. ఒక వైపు
వ్యధా భరిత క్షుధ్భాద
మరో వైపు..ఆహార పదార్ధాల
వృధా..క్షోభ.

ఆరు గాలం..కష్టించి
రైతన్నలు..పండించిన
తిండి గింజలు..
రకరకాల రూపం
దాల్చి..భువి నలు చెరగులా
జీవ జాలానికి..
అందుతుంటే.‌.ఆధునిక
నవ నాగరిక మానవులు

ఆహార పదార్థాలను
నేల పాలు చేస్తున్నారు.
పట్టెడన్నం..రొట్టె ముక్క
దొరక్క..ప్రపంచంలో..
కోట్ల మంది..అన్నార్ధులు
అలమటిస్తుంటే..
ప్రాణం పోసే..ఆహారాన్ని
నేల పాలు చేయడం…
న్యాయమేనా..? సబబేనా..!
అందరం..ఆలోచించాలి..!!

విజయకుమార్ గడియా
చిత్తూరు.

Comments (0)
Add Comment