సమదర్శిని న్యూస్టుడే: రోడ్డుభద్రతా నియమాలను ప్రతిఒక్కరు పాటించాలని డీఎస్పీ గంగారెడ్డి అన్నారు. యువత మత్తు పదార్థాలకు బానిస కావద్దని, యువ తరం అప్రమత్తంగా ఉండి కుటుంబానికి సమాజానికి ఆదర్శంగా ఉండాలని పేర్కొన్నారు. మండలంలోని శాకెర గ్రామంలో సోమవారం నిర్బంచ నిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 56 ద్విచక్రవాహనాలు, మూడు ఆటోలు, ఒక ట్రాక్టర్ను స్వాదీన పరుచుకున్నారు. గ్రామస్తులకు డీఎస్పీ లు విషయాలపై అవగాహన కల్పించారు. జాతీయ రహదారి పక్కనే ఉన్న గ్రామస్తులు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని, అలాగే వాహనం పోయినట్లైతే వెంటనే పోలీసులకు సమారం ఇవ్వాలన్నారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, డయల్ 100ను ర్వినియోగ పరచకుండా అత్యవసర సమయాల్లో ఉపయోగించుకోవాలని సూచించారు. ఇటీవల మహబూబ్ ఘాట్లో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనను గుర్తుచేశారు. వారు డయల్ వందకు పోన్ చేయడంద్వారానే సరైన సమయంలో ప్రాణాలు కాపాడగలిగామని వివరించారు. అలాగే దమ్ముచక్రాలను -హదారులపై తిప్పవద్దని సూచించారు. ఇందులో సోన్ సీఐ నవీన్ కుమార్, సోన్, లక్ష్మణచాంద, మామడ ఎస్సైలు కే. గోపీ, సుమలత, సందీప్, పోలీస్ బ్బంది పాల్గొన్నారు. |