కుల వృత్తులు కోల్పోతున్న ఆరె కటికలు

తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలని ప్రజల కోరిక

కుల వృత్తులు కోల్పోతున్న ఆరె కటికలు

తెలంగాణ లోని ఆరె కటికల కుల వృత్తులు మద్యం దుకాణాలను నడపడం, మాంసం విక్రయించడం వృత్తులు గా ఉండేవి. తెలంగాణలో ఆరె కటికలు దాదాపు 15 నుండి 20 లక్షల మంది వరకు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన జాతి ( బి.సి ) జాబితాలో ” డి ” గ్రూప్ లో ఉన్నారు.ఉత్తరాది రాష్ట్రాల్లో 18 రాష్ట్రాల్లో ఎస్పీ జాబితాలో ఉన్నారు. దేశమొకటే అయినా ఉత్తర, దక్షిణాది తారతమ్యాలు.

తెలంగాణ లోని ఆరె కటికకు ఇప్పటి వరకు ఎలాంటి ప్రభుత్వ పథకాలు అందలేదు. బి.సి లకు ప్రభుత్వ పథకాలు ఉంటాయనే విషయమే తెలియదు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ ఆరె కటికలు చట్టసభల్లో ఏ ఒక్కరికీ అవకాశం రాలేదు.అధికార., ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆరె కటికలన ఓట్లను వేసే వ్యక్తులుగా మాత్రమే చూస్తంన్నారు.కాని రాజకీయంగా ఎవరు ప్రోత్సాహం కల్పించడం లేదు.
తెలంగాణలో మద్యం దుకాణాల కేటాయింపులో గౌడ కులస్తులకు 30 శాతం కేటాయిస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం తరతరాల నుండి మద్యం దుకాణాలపై ఆధారపడి జీవిస్తున్న ఆరె కటికల గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.ఆరె కటికలకు మద్యం దుకాణాల కేటాయింపులో 30 శాతం కేటాయించాలని ఆరె కటికలు కోరుకుంటున్నారు.మద్యం దుకాణాలను అన్ని కులాల వారు నిర్వహిస్తున్నారు. మద్యం దుకాణాల కేటాయింపులో లక్షలకు, లక్షలు కొన్ని సందర్భాల్లో కోటి రూపాయలు పలకడంతో ఆరె కటికలు వేలం పాటల్లో వెనుక బడి కులీలుగా చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. దుబారా, రాశి అని సీసాల్లో కాకుండా విడిగా అమ్మినప్పడు ఆరె కటికల పట్టు ఉండేది. మద్యం దుకాణాల్లో కాకుండా విడిగా అమ్మడం నిషేధించిన తర్వాత ఆరె కటికల జీవితాలు అగమ్యగోచరంగా మారాయి.
మాంసం అమ్మడం ఆరె కటికలు మాత్రమే చేసేవారు. అరె కటికల ఉదార స్వభావం వలన అన్ని కులాల వారికి మాంసం అమ్మడం నేర్పించారు. ఇప్పుడు అన్ని కులాల వారు మాంసం దుకాణాలను నడుపుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాంసం అమ్మకాలను ప్రభుత్వ పరంగా నిర్వహించనున్నట్లు ప్రకటించడంతో ఆరె కటికలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం మాంసం దుకాణాలను ఆరె కటికలు మాత్రమే నిర్వహించేటట్లు చూడాలని కోరుతున్నారు.సమైఖ్యాంధ్రలో అరె కటికలు తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఎక్కువగా ఉన్నారు. సమైఖ్యాంధ్ర ప్రదేశ్ లో పరిపాలించిన ముఖ్యమంత్రులు, మంత్రులు ఆంధ్ర, రాయలసీమ కు చెందిన వారు కావడం వలన ఆరె కటికల సమస్యలు ఏ ఒక్కటి పరిష్కారం కాలేదు.తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో ముఖ్యమంత్రి కి, ఇతర మంత్రులకు, ప్రజాప్రతినిధులకు అందరికి ఆరె కటికల సమస్యలపై సంపూర్ణ అవగాహన ఉంది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఆరె కటికలు మాంసం దుకాణాలను మూసి వేసి పోరాటాల్లో చురుకైన పాత్ర పోషించారు.ప్రత్యక రాష్ట్రంలో ఆరె కటికల సమస్యలు పరిష్కరింపబడతాయని కలలు కన్నారు. కాని ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. అరె కటికలు మాంసం కోయడానికి మండీలను ఉపయోగిస్తారు. కాని మండీలను మూసి వేయడం వలన అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.మూతబడిన మండీలను తెరిపించాలి.
అన్ని కులాల వారికి అన్ని విధాలా ఆదుకుంటామని చెప్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరె కటికలకు మద్యం దుకాణాల కేటాయింపులో 30 శాతం కేటాయించాలని, ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు ప్రకటించిన మాంసం దుకాణాలను అరె కటికలకే కేటాయించి ఆరె కటికల కుల వృత్తులను కాపాడాలని కోరుతున్నారు.

డాక్టర్. ఎస్. విజయ భాస్కర్,
తెలంగాణ రాష్ట్ర ఆరె కటిక ట్రస్ట్ వ్యపస్థాపక సభ్యులు.,
అఖిల భారత ఖటిక్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.,
9290826988