తెలంగాణ పండుగ

డా॥బండారి సుజాత హన్మకొండ

తెలంగాణ పండుగ
~~~~~~~~~~~~

బుతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
బంగారు గౌరమ్మ ఉయ్యాలో

పూల పండుగ వచ్చి ఉయ్యాలో
సందడి తెచ్చింది ఉయ్యాలో

అక్క చెల్లల్లకు ఉయ్యాలో
ఇష్టమైన పండుగ ఉయ్యాలో

మహాలయ అమావాస్య లో ఉయ్యాలో
మొదలయ్యేను బతుకమ్మ ఉయ్యాలో

ఎంగిలి పూల బతుకమ్మగ ఉయ్యాలో
వినతికెక్కినదమ్మ ఉయ్యాలో

తంగేడు పూలంటే ఉయ్యాలో
బతుకమ్మకు ఇష్టమూ ఉయ్యాలో

ఎన్నెన్నో పూలతో ఉయ్యాలో
బతుకమ్మను పేర్చి ఉయ్యాలో

ఆడెదరు ఆటలు ఉయ్యాలో
పాడెదరు పాటలు ఉయ్యాలో

ప్రతిరోజు బతుకమ్మకు ఉయ్యాలో
నైవేద్యం పెట్టేరు ఉయ్యాలో

తొమ్మిదవ రోజు ఉయ్యాలో
పెద్ద , చిన్నబతుకమ్మను పేర్చి ఉయ్యాలో
తల్లి పిల్ల బతుకమ్మలతో ఉయ్యాలో
పెద్ద ,చిన్న ఆడవాళ్ళందరు ఉయ్యాలో
తనివితీరా ఆడి, పాడేరు ఉయ్యాలో

చెరువు నీళ్లలోన ఉయ్యాలో
నిమజ్జనం చేసేరు ఉయ్యాలో

బతుకమ్మ ఆట ఉయ్యాలో
ఆనందాలు పంచునూ ఉయ్యాలో

స్నేహ హస్తం అందించు ఉయ్యాలో
చెలిమిని చేయును ఉయ్యాలో

పంచుకొని తినడంతో ఉయ్యాలో
ఐకమత్యం పెరిగేను ఉయ్యాలో

పోటీ తత్వానికి ఉయ్యాలో
పెట్టనికోట ఉయ్యాలో

ఆలోచనను పెంచే ఉయ్యాలో
అమ్మ మా బతుకమ్మ ఉయ్యాలో

తెలంగాణ ప్రజలకు ఉయ్యాలో
తేరు ఈ బతుకమ్మ ఉయ్యాలో

డా॥బండారి సుజాత
హన్మకొండ