దసరా పాట

నరసింహా వ్యాసం

దసరా.. విశేషము

విజయ దశమి అంటే విజయాలకు నాంది పలుకుతూ ప్రత్యేకమైన మహాశక్తి పూజ . ముద్ద బంతుల్లో ముస్తాబగు బతుకమ్మ జాతర లోకమంతా పండుగ జరుగు కనుల పండుగ .కోలాటాలతో ,గంగిరెద్దు ఆటలతో వేషాలతో ,నాటకాలతో ,బొడ్డెమ్మలతో , సందడిగా సాగు నవరాత్రుల పండుగ మహా పరువదిన పండుగ ఆహల్లా దకరమైన పండుగ పుట్టిళ్లకు ఆడపడుచులు రాక కొత్త అల్లులు రాకతో సంతోషాలు వెల్లువిరిసే పస్సందైన పండుగ

జొన్నదంట్లతో జమ్మి చేటు దగ్గరికి వెళ్లి చెట్టుపైకి విసిరి జమ్మి చెట్టుకు పూజలు చేసి ప్రదక్షణలు చేసి ,జమ్మి పత్రాలు కోసి దేవవుళ్లకు ముందుగా యిచ్చి వారి దీవెనలు పొందెదరూ అందరూ .ఇళ్లకువెళ్లి పెద్దలకు జమ్మిలాకులు ఇచ్చి వారి ఆశీర్వాదములు చిన్నెలు పొందుతారు .ఇది అనాదిగా మనభారతీయ సంస్కృతిలో సాగు ప్రతిష్టమైన కార్యక్రమం నేటికి కొనసాగుతుంది .

”రంగు రంగు కొక్క పువ్వు
పువ్వు పువ్వు కొక్క తీరు
ఆడి పాడ పడుచులంత
ఊరు వాడల జోరు
వారెవ్వా..!బతుకమ్మ పండుగ
వచ్చిందంటే ఆకథే వేరప్ప…

కట్టుకోని పూల మేడ
కట్టుకోని పట్టు చీర
ఆడుతూ..పాడుతూ..
పరవసించి పోర..
వారెవ్వా..!హుందాగ నడిచి కుందన
బొమ్మలు దిద్ది మెరుగులు

చూడ కళ్ళు చాలునా..
చూసి మనసు వుండునా
కలిసి ఆడి పాడకుండ
అరె వయస్సు వుండునా ..
వారెవ్వా ..!చిందులు వెయ్యకుండా..
సిటీ కొట్టకుండా..

మందార కా0త నుదుట
సింధూరం సూర్యుడు
తను ఆగ్రహించిన ఎదుట
నిలిచే వీరుడు లేడు
వారెవ్వా..!అమ్మ విశ్వరూపము
ప్రచండ తేజము

బంతి పూల గూటిలో
బుట్ట బొమ్మ బతుకమ్మ
జానపదుల పాటలో
పదాల ధార బతుకమ్మ
వారెవ్వా..!నవరాత్రుల బతుకమ్మ శోభమయం
అరవిరిసిన మందారం

ఇంటింటి ముంగిట్ల
కొలువుగా బతుకమ్మ
కొండంత అండగా..
అందరికీ బతుకమ్మ
వారెవ్వా ..!అమ్మలను గన్న అమ్మ
పుణ్యాల మూల పుటమ్మ..

తంగేడు పూలలోన
ముద్ద బంతి పూల లోన
మురిసి పోతుందిగా..
బతుకమ్మ ఇలలోన
వారెవ్వా..!పచ్చ పచ్ఛాని గడపలన
చక్క చక్కాన్ని లోగిల్లా..

విజయాలును నోసుగు
విజయభవాని బతుకమ్మ
కరుణతోడ కాపాడు
ముత్తైద బతుకమ్మ
భావ బంధాలకు
ఆత్మీయురాలు బతుకమ్మ ”

sఇలా జానపదులు తమ మాటల్లో పాటల్లో గౌరమ్మను ఎన్నో నామాలతో స్తుతించి ఆరాధిస్తారు తమ ఆటపాటల్లోనే తాము ఎనలేని ఆనందాలను పొందెదరు .

కమ్మ కమ్మని పిండి వంటలతో దేవుళ్ళకు అమ్మవారికి నైవేద్యం సమర్పించెదరు ..ఆటపాటల సందడితో..సంతోష పరువళ్ళతో కుటుంబ సమేతంగా.. గౌరప్రదముగా.. ఈ పండగ శుభకార్యాలను నడిపేదరు

గాజులనరసింహ
నాగటురు గ్రామం ,కర్నూలు జిల్లా
9177071129