ఒంటరి కాను నేను!! (స్వరం ప్రక్రియ)

కీర్తి పూర్ణిమ

ఒంటరి కాను నేను!!

బరించానూ
బరించానూ!!
ముత్తైదువల నోటితో
ఇసడుంపులు
బరించాను

చూసాను చూసాను!!
ఒంటరినని
కామంతో చూసిన
క్రూరమృగాల పాడు
చూపులు చూసాను

విన్నాను విన్నాను!!
ఒంటరి దానికి
డబ్బులేడివి అని గుసగుస
లాడిన చెవులు కోరికే
మాటలు విన్నాను

సహించాను సహించానూ!!
నష్ట జాతకురాలినని
అసహ్యించుకున్న
సమాజాన్ని
సహించాను!!

ఇక వినేది
లేదు చూసేది
లేదు!!
సహించేది లేదు
బరించేదీ లేదు!!

పడుపు వృత్తికి దిగమన్నారు
కడుపు నిండుద్ధి రమ్మన్నారు!!
చెయ్యి పట్టిన రాక్షసమూకల
చెదలు పట్టిన ఆలోచనని
బూడిద చేసే దాకా ఆగను!!

ఏమీ సాధించలేనన్నరు
నడిరోడ్డు మిదకినెట్టారూ!!
బంగారు పతాకాన్ని తెస్తాను
సాధించి నేనేంటో చూపిస్తాను!!
అంతవరకు అలిసేది లేదు

సాధిస్తాను సందిస్తను నా
జీవితం దురదృష్టం కాదని
కష్ట పడి నిరూపిస్తను!!
అనుకుంటే ఏదైనా సాధిస్తా
నేను నిరుపిస్తాను!!

ఒంటరి కాను నేను ఒంటరి
కాను ధైర్యం తోడుంది నాకు!!
ఒంటరి కాను నేను
ఒంటరి కాను
విజయం తోడుంది నాకు!!

ఒంటరి కాను నేను!!
ఒంటరి వాళ్ళకి
స్ఫూర్తిని నేను!!
రేపటి తరానికి
మార్గదర్శి నీ నేను!!