*కార్తీక పౌర్ణమి*
=============
కార్తీకమాసంబున
పవిత్ర నదీ స్నానం
పుణ్య క్షేత్ర దర్శనం
కల్గుముక్తికి మార్గం
చేసే వ్రతం, జపం
చేసే దానం ధర్మం
చేసేటి పుణ్య కార్యం
కల్గించుశుభఫలితం
పవిత్ర కార్తీక మాసం
హరిహరులకు ప్రీతికరం
దీపజ్యోతులతో లోకం
అయ్యేను పునీతం.
కార్తీక శోభతో
నిండు పౌర్ణమి,
కార్తీక దీపాలతో
దేదీప్యమానం…
పంచభూతాలు
పరవశించగ.,
పుడమి తల్లి
పులకించగ.!
కార్తీక పూర్ణిమ
చంద్ర కిరణాలు,
మానవ మనోహర
మదన సుమ శరాలు.
వొయ్యారాల నొలికిస్తూ
శోభిస్తుంది ప్రకృతి,
ఈ నాటి రేయి అంతా
పులకిస్తుంది ధాత్రి!
*ఎన్.రాజేష్(జర్నలిస్ట్)*
హైదరాబాద్-9849335757