వేయి వసంతాల నీ స్ఫూర్తి
ఉద్యమ నెలవంకల నెత్తుటి గాయాలు వెలుపల
నిరంతర పునరుజ్జీవన పరిశోధనలు లోలోన తెలంగాణ బానిససంకెళ్ళను తెంచడానికి సంసిద్ధమై సమర శంఖాలను పూరించిన ఉస్మానియా సింహాలం ప్రశ్నించడం జన్మహక్కని పరిశోధించడం పౌరహక్కని ప్రాణత్యాగాలకు ఆలవాలమైన ఉస్మానియా ప్రాంగణం, చరిత్ర గర్భాన దాచిన సత్యశోధనల్ని ప్రకటించే మాగాణం మస్తిష్కంలో ఆవిష్కృతమైన విప్లవ చైతన్య భావాల సుమిదులం
సమాజ హితమే సిద్ధాంత ప్రయోజన వారసులం తెలంగాణ పోరాటమే నూకు అజరామర ఆనందోత్సవం డాక్టరేట్లమైన మేము ప్రజల కోసం ప్రాణదానం చేసాము నిరుద్యోగం నిలువునా దహించి వేస్తున్నా సహించాం లాఠీలు తూటాలు లెక్కకావని మిలియన్ మార్చ్ నిర్వహించాం వెనుకాడ లేదెప్పుడూ చదువుకైనా సమరానికైనా భావితరాలకు బంగరు నిధులు సమకూర్చడమే ధ్యేయంగా – ఉస్మానియా తెలుగుశాఖలో పరిశోధనలే మా లక్ష్యంగా ప్రాచీన తెలుగుభాష మనదేనని దశదిశలు చాటినాం
తెలంగాణ సాధించిన ఉస్మానియా పునాది రాళ్ళం వంద శతాబ్దాలు నీ కీర్తి విరాజిల్లాలని
వేయి వసంతాలు నీ స్ఫూర్తి పరిఢవిల్లాలని
పరిశోధక విద్యార్థిగా నీ వెంటే నడుస్తాం, ఉస్మానియా శతాబ్ది ఉత్సవాలను విశ్వవ్యాప్తం చేస్తాం హృద్యమైన నీ నామాన్ని మా యెదలో స్మరిస్తాం
రచన
డాక్టర్ ఎల్మల రంజీత్ కుమార్
9849808757