అంశం.. వ్యవసాయం
శీర్షిక. రైతుకూలి
కవిత. వచనం
పేరు. వేము వందనం
శరవాణి 83743 33907
🌲🌹🌲
మండుటెండల్లోనే నారుపోసి
రెండుబుంగలతో నీళ్ళుతెచ్చి
నారుమడంతా చల్లినప్పుడు
పొలం నాగళ్ళతో దుక్కి దున్ని
ఎరువులు మందులెన్నో చల్లి
పంట చేతికొచ్చే తరుణంలో
గాలివానలు వాయుగుండాలు
తుఫానులు త్సునామిలెన్నెన్నో
మాపై ప్రత్యక్ష యుద్ధంచేస్తుంటే
ఆరు గాలం కష్టానికి ఫలితం
చేజారుతున్నతరుణంలోరైతన్న
దుఃఖాన్ని చెప్పెవరి తరమౌను.
బ్యాంక్లుచ్చినప్పులు తీరేదేమో
వడ్డీలు కట్టె స్తోమతేది మాకు
మాతిండిసంగతాదేవుడి కెరుక
చిల్లరప్పులుతీరేదారెక్కడోకదా!
”రైతేరాజన్న” నినాదమేనాటిదో
” పొలం వద్ద మాసూళ్ళు”లేవు
” ఇంటి వద్ద తహసీలుతప్పవు
నాటిజైకిసాన్నేటి రైతుకూలీ!?