నేటి నాణెములపై *తెలుగు భాష* కనుమరుగైంది

కొల్లాబత్తుల సూర్య కుమార్

*తెలుగు నాణెం*
నాటి నాణెములపై *తెలుగు భాష* కనబడింది!
నేటి నాణెములపై *తెలుగు భాష* కనుమరుగైంది!!
————————————————–
*నాటి నాణెం పై తెలుగు భాష*
స్వాతంత్ర్యానికి పూర్వం బ్రిటిష్ వారి పాలనలో తెలుగుభాషకు సముచిత స్థానం ఉండేది.బ్రిటీష్ ప్రభుత్వ హయాంలో చలామణిలో ఉన్న నాణెములపై ఆ నాణెము పేరుని ఐదుభాషలలో ముద్రించేవారు. అందులో తెలుగు ఒకటి.నేడు చలామణీలో ఉన్న నాణెములపై తెలుగు కనుమరుగయింది. పోడూరు మండలం గుమ్మలూరు ఉపాధ్యాయుడు కొల్లాబత్తుల సూర్య కుమార్ సేకరించిన నాణెములలో 1944సంవత్సర ప్రాంతంలో ముద్రితమైన ఒక అణా,రెండు అణా నాణెములపై తెలుగులో ఒక అణా,రెండు అణాలు అని స్పష్టంగా ముద్రించబడి ఉండటం గమనించడం జరిగింది.
ఇతర భాషలతో పాటు తెలుగు వారి మాతృభాషైన తెలుగుకి ప్రాధాన్యతనివ్వడానికి పాలకులు కృషి చేస్తేనే తెలుగు భాష సజీవంగా ఉండగలుగతుంది.