నానకు ఆంధ్ర లెజెండ్ అవార్డ్

నాశబోయిన నరసింహ(నాన)కు ఆంధ్ర లెజెండ్ అవార్డ్

నాశబోయిన నరసింహ(నాన)కు ఆంధ్ర లెజెండ్ అవార్డ్:
ఆంధ్ర లెజెండ్ సేవ పురస్కారాన్ని నల్గొండ జిల్లా చిట్యాలకు చెందిన కవి,రచయిత,ఆరోగ్యపర్యవేక్షకులు నాశబోయిన నరసింహ (నాన) అందుకోనున్నారు.ఆదరణ వెల్ఫేర్ సొసైటీ(AWC) సంస్థ వారి ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకుని నిర్వహించే “ఆంధ్ర లెజండ్ సేవా పురస్కారం _2022″ను ప్రస్తుతం NVBDCP సబ్ యూనిట్ సికింద్రాబాద్ లో విధులు నిర్వహిస్తూ,గత కొన్నేళ్లుగా వృత్తిపరంగా వైద్య ఆరోగ్య సేవలతో పాటు, సమాజ హితం కాంక్షించే సాహిత్య రంగంలో కృషి చేస్తున్నందుకు గాను కవి,రచయిత, ఆరోగ్య పర్యవేక్షకులు నాశబోయిన నరసింహను ఎంపిక చేసినట్లు ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు గొట్టేముక్కల చెన్నకేశవులు ప్రకటించారు.ఈ అవార్డును మార్చి 20న ప్రకాశం జిల్లా మార్కాపురంలో ప్రముఖుల చేతుల మీదుగా అందుకోనున్నట్లు నరసింహ తెలిపారు.ఈసందర్భంగా సామాజిక రచయితల సంఘం నల్గొండ అధ్యక్షుడు సరికొండ ప్రకాష్ రాజ్, సాహితీ మిత్రులు,ప్రముఖ సాహితీ వేత్త డాక్టర్ ఎల్మల రంజీత్ కుమార్,మరియు సహ వైద్య ఆరోగ్యశాఖ మిత్ర బృందం నరసింహకు అభినందనలు తెలిపారు.