యువత కు వివేకానందునిభోధనలే ఆదర్శం

యువత కు వివేకానందునిభోధనలే ఆదర్శం

యువత కు వివేకానందునిభోధనలే
ఆదర్శం
—–
పామిడి, మే 15:
వివేకానందుని ఆశయాలకు అనుగుణంగా యువత ముందుకు సాగాలని పలువురు స్వామీజీలు విజ్ఞప్తి చేశారు. రామకృష్ణ వివేకానంద, భావ ప్రచార పరిషత్ రాయలసీమ విభాగం వారి 4వ భక్త సమ్మేళనం లో”వివేక సదస్సు “లో స్వామీజీలు అభిభాషించారు. తల్లీ బిడ్డల ప్రేమ లాగే దేశంలోని ప్రతిఒక్కరు దేశ భక్తితో ముందుకు వెళ్లాలని స్వామి సన్నివాసానంద మహారాజ్ కోరారు. దేశ సేవకు, మాతృభూమి సేవకు పేరు, ప్రతిష్టలు అవసరం లేదన్నారు. ప్రతిఒక్కరు అక లి లేకుండ బ్రతకాలని, చదువు పై శ్రద్ద చూపి జ్ఞానన్ని సముపార్జించాలని, చదువే సర్వరోగ నివారిణి అని, ధరణికి భారత్ గురువన్న వివేకానందుని వాక్కులను ఆశయంగా తీసుకోవాలని ఆయన యువత కు పిలుపు నిచ్చారు. యువత లో
వ్యక్తిత్వ వికాసం, ధైర్య సాహసాలు, దృఢసంకల్పం, ఉన్నతవ్యక్తిత్వం, పెరగాలని, భారత మాత పై ప్రేమ అనురాగాలు వర్ధిల్లాలని, ఆత్మ సాక్షత్కారం పొందినవాడె నిజమైన సన్యాసి అని, ధ్యానంతో ఆత్మ, పరమాత్మా, అంతరాత్మలను చుడగలగాలని అవే వివేకానంద ఆశయాలని స్వామి స్వసం వేద్యానంద మహారాజ్ అన్నారు
వివేకానందుని అనుష్టాన వేదాంతపై స్వామి దివ్య ధర్మనంద మహారాజ్, వివేకానందుని దీన జనసేవ పై నాగ త్రిశూలపాణి ప్రసంగిచారు
అప్పాజిపేట రామచంద్ర, శివ, కదిరి గంగధర్ పాల్గొన్నారు
స్వామీజీలకు యతి పూజలు జరిపి ఘనంగా సత్కరించారు