శ్రీకాకుళం జిల్లా కేంద్ర గ్రంధాలయం లో 57 వ జాతీయ గ్రంధాలయ వారోత్సవాలలో భాగం గా జిల్లా కేంద్ర గ్రంధాలయం లో భారతతొలి మహిళా ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ జయంతి సందర్భం గా ఉపాధ్యాయిని శ్రీ మతి రేవతి గారు ఇందిరమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం లో శ్రీకాకుళం జిల్లా గ్రంధాలయ కార్యదర్శి శ్రీ బుర్రి కుమార్ రాజు విద్యార్థినులను ఉదేశించి మాట్లాడుతూ ప్రతి విద్యార్థిని ఇందిరాగాంధీ జీవితాన్ని ఆదర్శం గా తీసుకోవాలని ఆమె లాగా దృదమైన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్లాలని సూచించారు.ఈ కార్యక్రమం లో వివిధ పాఠశాలల విద్యార్థినిలకు రంగవల్లికల పోటీలు నిర్వహించారు. తదనంతరం విద్యార్థులకు నాట్యపోటీలు నిర్వహించారు
ఈ కార్యక్రమం లో శ్రీకాకుళం జిల్లా కేంద్రగ్రంధాలయం డిప్యూటీ లైబ్రేరియన్ వివిజిఎస్ శంకర రావు, అసిస్టెంట్ లైబ్రేరియన్ పి వి భాస్కర రాజా, సిబ్బంది కళ్యాణి, వరలక్ష్మి, ప్రత్యూష, రామ్మోహన్, గణేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని సోడవరం ఈశ్వర రావు గారు పర్యవేక్షించారు.