సిరి వెన్నెల

సిరి

శీర్షిక :- *సిరి వెన్నెల*

నీలాల నింగిలో సిరివెన్నెలలు కాయించే చక్కని చందురుడా
నీ వెలుగుల కాంతులతో
ఈ నిరు పేద కలువను స్మృసించి
పెన వేసిన మనసుల విడలేని బంధాన్ని
సృష్టి కి కానుక చేసిన ప్రణయ మూర్తి నీవేనా
చుక్కల సీమ లోని చక్కని చంద్రుడా!
గడ్డి పువ్వు పై ఇంత మమకారమెందుకో
ఆకాశమంత మనసున్న మమతల రేడా!!
కలల నేస్తమా !

కలువ ను నేనై వేచున్నాగా
సిరి వెన్నెల పంచగ రావా చంద్రమా..
నీవు రాక నీదరి చేరక
కలతపడదా కలువ మనసు
వసంతాలే వెల్లువలా..రావా ..నాలో..
నీరాకతోనే……మనసు మురిసే..కలువ విరిసే
నీ మనసే దోచి నా మనసే నీలో దాచెద రావా
నా వెన్నెల రాజా….ఓ నెలరాజా…
ఆకాశ కుసుమానై నిను చేర నేనే రానా
వెన్నెల ఆకాశం ….మురవదా మనల చూసి…
కలువల కలల నేస్తమా కలకలలాడెనురా నీ వలనే ఈ కలువ మనసీవేళ…
మౌన బాషలు నేర్పిన మదిలోని అలజడి నీదేరా!! మారిపోకు తత్ నేస్తమా..!
నను మరువబోకు నా మనసెరిగిన మౌన స్నేహమా!!

*ఇది నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను*

సిరిపురపు నాగలక్ష్మి
కలం పేరు :- సిరి
తెలుగు ఉపాధ్యాయిని
మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకులం శ్రీశైలం
9989659416