గాజుల నరసింహ పాటలు

samadarshini.com

శీర్షిక :- అందని తీరం
గాజుల నరసింహ

నాకలం శ్రమిస్తూ వుంది అహర్నిశలు
స్వప్నాల చిత్రాలను వర్ణిస్తూ అనుదినము

ఆకాంక్ష శిఖరాల కోసం అన్వేసిస్తూ…
నాపాదం కదులుతూనే వుంది నిరంతరము

కాసింత ప్రేమకోసం నా గుప్పెడు గుండె ఎదురు చూస్తుంది
అందమైన ఆత్మీయత కోసం నా మనస్సు తపిస్తుంది క్షణం క్షణం

నా ఊహలకు అతీతమై నా హృదయ సామ్రాజ్యానికి రాణివై
నిధురించే చెలివో నూవ్వెక్కడ ఉన్నావో కదా యెలా ఉన్నావో కదా..

చిరుగాలి కబురులు చిగురంతైనా లేవు
నీ చిలిపితనపు పలుకులు కొసరంతైనా లేవు..

లోకాల తీరాలు దాటి గగనాల అంచులు తాకి అలసిపోతున్నా
కలలరూపాలు తిలకిస్తూ నాలోనేనే మురిసిపోతున్నా..

సమధర్శిని…
తేదీ :-20-12-22
అంశం :- ధర్మాసకవితోత్సవాలు
ప్రక్రియ :-గేయం
గాజుల నరసింహ
రచన సంఖ్య :3

1

కోయన పూలు కోయనా.. కోదండరామా కోయనా..2
కొమ్మ కొమ్మ కోటి పూలు పూసింది కొమ్మలిరగా
మాయింట పరసాల చెట్టు సిరిమల్లె చెట్టుc
తల్లి సీతమ్మ సిగనింప సిరిమల్లె పూలు
మనసైన మరుమల్లె పూలు కోయనా కోదండరామా..రామా..!శ్రీరామా..!! 2

2

వన్నె వన్నెలా పూలు వగలు వలకబోయే పూలు
తళుకు బెళుకు జిలుగు వెలుగు పూలు
ఒకటా రెండా వేలు పదివేలు ఆ పూలు
పలుకరించే పారిజాతాలు మదిని పరవశింపచేసే పరిమళాలు
ముగ్ధమైన పూలు ముద్ద మందారాలు
సిరిగల సీతమ్మకు సిరివెన్నెల పూలు కోయనా..కోదండరామా..రామా!శ్రీరామ..!! 2

3

అన్నట్టు ఉన్నటు వుంది పుట్టింది తనకోసమేననీ
పూచి ప్రతి పువ్వు కొమ్మాలిరగా..
పరిమళాలు వెదజల్లి మకరందాలు చిందించే
సంపెంగపూలు సన్నాజాజీ పూలు
సోంపైనా పూలు ఇంపైనా పూలు ఒకటా రెండా..
వేలు పదివేలు ఆ పూలు లేలేత పూలు పసిడికాంతి పూలు
కోయనా కోదండరామా.. రామా..!శ్రేరామా..!!

గాజుల నరసింహ
9177071129
హామీపత్రం :- ఇది నాసొంత రచన

: గోపాల బాల గోవిందా..
ప్రక్రియ :- గేయం
గాజుల నరసింహ

1

యశోదసుతుడా రాధా ప్రియ సఖుడా
అలగకురా తొలగకురా అటుఇటు పరుగులు తీయకురా..
గోపాలా గోవిందా.. జయ గోపాలా గోవిందా..
నువ్వు జనులకు ఆప్తుడవు నెమలి కనుల వాడ అందరివాడవు
మానసచోర మహావీర రాధా ప్రియే..

2

శిరసున నెమలీకలు అరచేతిలో.. నీ
అందరి రాతలు ఎరిగిన వాడవు కృష్ణా..
నాటకాల సూత్రధారుడవు బూటకాల మాంత్రికుడవు
దయాశీలుడవు ధర్మకార్య నిరతుడవు
అఖిల జాగలకు పాలకుడవు పావనా.. నువ్వు..
మానసచోర మహావీర రాధాప్రియే

3

నీతి పథంబులనడిచి విజయంబులు గెలిచి
అపజయము లేరుగని అజేయుడవు
మధు మృధు మాటల వక్తవు
చతురోక్తుల దిట్టవు నువ్వు కృష్ణా..
యుక్తులెన్నో యోచించి ఎత్తులను చిత్తులుగావించేదవు
ఎవ్వరూ నీకు తగు సాటి..
మానసచోర మహావీర రాధా ప్రియే..

4

తప్పటడుగులు వేసినా తప్పుటడుగు వేయవు
తలమాణికమై నిలిచావులే నువ్వు రేపల్లెకు
పడుచుల ప్రేమహృదయాలలో కట్టావు ప్రేమనగరులు ఎన్నో
అల్లరి ఆటలతో అసురుల ఆటలు కట్టించావు
విశ్వాసనీయుల ఆత్మలో ఆత్మీయడవై నిలిచావు
అందరి హృదయాలు ప్రేమతో గెలిచావు నువ్వు కృష్ణా…
మానసచోర మహావీర రాధా ప్రియే….

5

రాధను మించు ప్రియులు ఎవ్వరు నీకు
యుగాలు మారినా రాధా కృష్ణ గాధలే
ఎంతో కొనియాడిరి లోకులు ఇలనా..
ఎంత సొగసరివో అంత గడసరివో
నువ్వు కృష్ణా.. నీవేకదా అందరి దేవుడవు
గోపాల బాల గోవిందలాల గోవర్ధనా..
మానసచోర మహావీర రాధాప్రియే..

గాజుల నరసింహ
9177071129
హామీపత్రం :- ఇది నాసొంతము

సమాధర్షిణి వేదిక
అంశం :-శిల్ప సంపదలు
23,12,22
గాజుల నరసింహ
ప్రక్రియ :- గేయం

శిలలు కావవి శిధిలము కావవి
అవనికేగిన అవతారములు అపురూపములు
అద్వైత భావాలు ఎన్నో నిండినా.. సవ్య సాక్షితులు…||

అబ్బురపరిచే అందాలు అజంతాలు
కనుల విందులు గావించే అమరావతీ నగరాలు
నాలుకలాడిన నాట్యపలుకుల రూపాలు
రాతి రాతికి అంటిన మధుర స్వప్నాలు
శిల్పుల మదిలో ఊరిన దివ్య జలపాతాలు
తీరని దాహాలకు అలసట హృదయాలకు ఇవే ఇచ్చుకదా ఊరటలు ||

ఉల్లి సమ్మెటల పలికిన ప్రతిభల ప్రతిమలు
కమ్మని ఊహల కదిలోచ్చిన హాయి తెమ్మరలు
కావా.. అవి రసక్రీడకులకు రస గుళికలు
పరవశాన మైమరుపులో పలికించు రసగీతికలు ఇవే కదా..
ఇవే కదా వెలకట్టలేని సంపదలు
ఇలలో ఈ జగతికి జీవాకృతులు ఇవే కదా..||

ఆ వంపు సొంపులు కళాతీతములు శిల్పుల నైపుణ్యములు
భారతవనిలో ఇవే భాగ్యపు నిధులు
గాంచిన ఒకమారు కదలాడు కళ్ళలో పలుమారు
కొండకొండలకు కోరిన విధముల చెక్కిరి అకృత్తులు మహానుభావులు
పరమత సహనాలకు పరంపరహితములకు ప్రతీకలు ఇవేకదా.. ఎల్లలోకాలకు..ఇవేకదా…||

గాజుల నరసింహ
9177071129
హామీపత్రం :- ఇది నాసొంత రచన..