ఎములాడ రాజన్న ఎల్లిండు సూడు…
ఎల్లిండు సూడు…
కాలు గజ్జెకట్టి కదిలిండు సూడు…
కదిలిండు సూడు….
ఇన్పశూలంభూతో నా ఇంటికొచ్చే..
నా ఇంటికొచ్చే…
ఇల్లంతా తిరిగి నా పక్క జెరె…
నా పక్క జెరె….
ముచట్లేన్నోవెట్టి మురిసి పోయిండే..
మురిసి పోయిండే…
ఓర్రీ ఓర్రీ నా వోడిలోన వండే…
వోడిలోన వండే…
ఆవులంత కలిసి అంబ అంటున్నయ్..
అంబ అంటున్నయ్..
మా సుట్టు చేరి మాతోనె ఉన్నాయ్..
మాతోనె ఉన్నాయ్..
లెచిన శివుడు పాలు విండిండు..
పాలు విండిండు….
పాయసంభూ చేసి పంచి పెట్టిండే…
పంచి పెట్టిండే….
పాముకాటు నాకు ఆ బ్రహ్మ రాస్తే..
ఆ బ్రహ్మ రాస్తే….
చీమకాటుతో శివుడు సరిపపెడతా ఉండే…
సరిపెడతా ఉండే….
దప్పు కొట్టి శివుడు దరువేసే జూడు..
దరువేసే జూడు…..
దరువులోన శివుడు నాట్యంభూ నేర్పే..
నాట్యంభూ నేర్పే…….
యోగక్షేమలన్నీ అడిగి పోయిండు…
అడిగి పోయిండు….
మల్లోస్తనంటు మాయమయ్యిండే…
మాయమయ్యిండే …..