పామిడి పట్టణం లోని తగ్గుదేవాలయం లో వెలిసిన శ్రీదేవి, భూదేవి, శ్రీ అనంత, గజ, గరుడ లక్ష్మీ నారాయణ స్వామి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. సాయంత్రం 6.30నుండి స్వామి అమ్మవార్ల కళ్యాణం విశ్వనాథ శర్మ వేదోత్సరణ మధ్య నిర్వహించారు. కల్యాణ కర్తలు గా టంగుటూరు రాజశేఖర్, పార్శం రాహుల్ గుప్తా వ్యవహరించారు. ఆలయ అధ్యక్షులు సాయిప్రకాష్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిపారు. పుణ్యవచనం, గణపతి పూజ, యజ్ఞోపవీత ధారణ, మధు పర్కాలు, ముహూర్త జిలకర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాలు కార్యక్రమం మంగళ వాయిద్యాల మధ్య జరిపారు. అనంతరం ఆలయం లో ప్రాకారోత్సవం నిర్వహించారు. పి. కృష్ణ కుమార్, అంగజాల సుధీర్ కె. శివరంగయ్య, లక్ష్మయ్య, బాలకృష్ణ, బాల నాగరాజు, శ్యామ్ భక్తులు పాల్గొన్నారు. భక్తుల గోవింద నామస్మరణ తో ఆలయం మార్మోగింది.అనుంపల్లి భాస్కర రావు మార్గశిర మాసం విష్ణు మాసమని అన్నారు. ప్రతి సంవత్సరం మార్గశిర మాసం తొలి ఆదివారం ఈ కార్యక్రమం జరపడం అనవయుతి గా జరుగుతుంది.