తెలుగులో జాతీయ సదస్సు

ఆంధ్ర విశ్వకళాపరిషత్ ,విశాఖపట్నం ,తెలుగు విభాగం,సమైక్య భారతి మరియు ఆంధ్రాభవన్,ఖర్గ పూర్ (ప్రైమరీ & సెకండరీ స్కూల్ ) ఆధ్వర్యం లో ఫిబ్రవరి 21 ,2024 తేదీన ( బుధవారం ) అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ఒక రోజు జాతీయసదస్సు నిర్వహించాలని నిర్ణయించడమైనది.

*అంశం: అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం–తెలుగు భాషా విశిష్టత*

” జాతీయ సదస్సు- ” ప్రధాన అంశాలు

1.ప్రపంచ భాషలు-మాతృభాషోద్యమాలు
2.మాతృభాషలు-జాతీయ విద్యా విధానం
3.మాతృభాషలు-ప్రపంచీకరణ
4.మాతృభాషల పరిరక్షణ-సూచనలు,సలహాలు
5.మాతృభాషలు–ప్రాశస్త్యం
6.మాతృభాషలు-ప్రాథమిక విద్య దాని ప్రాముఖ్యం
7.మాతృభాషలు-సమాజాభివృద్ధి
8.తెలుగు భాష-కంప్యూటర్ సాంకేతికత
9.బోధనాభాషగా తెలుగు
10.తెలుగు భాషా ప్రణాళిక-ఆవశ్యకత
11.ప్రపంచ భాషలు-తెలుగు భాషా గొప్పదనం
12.తెలుగు భాష -నాడు, నేడు
13.ఆధునిక తెలుగు భాష-తీరుతెన్నులు
14.తెలుగు భాష-భాషాశాస్త్రవేత్తల కృషి
15.తెలుగు భాషోద్యమకారులు-భాషాసేవ
16.శాస్త్ర సాంకేతికరంగాలు- తెలుగు భాష
17.తెలుగు పత్రికలు-భాషా సేవ
18.తెలుగు భాష-ప్రసారమాధ్యమాలు-భాషాకృషి
19.భాష-వారసత్వం
20.భాష-చరిత్ర-సంస్కృతి
21.సమాజం-భాష
22.తెలుగు భాషా సంఘాలు-భాషా సేవ
23.తెలుగు వాచకాలు-భాషా పరిశీలన
24.భాష-వ్యాకరణం-పరస్పర సంబంధం
25.న్యాయస్ధానాలలో తెలుగు భాష
26.పరిపాలనా భాషగా తెలుగు
27.తెలుగు ప్రాచీన విశిష్ట భాషాధ్యయన కేంద్రం-భాషాకృషి
28.ద్రావిడ భాషల్లో తెలుగే ప్రాచీనం
29.అధికార భాషాసంఘం-భాషాకృషి
30.భారతీయ భాషలు-కేంద్ర ప్రభుత్వ భాషా విధానం
31.తెలుగు భాష-ప్రభుత్వ ధోరణి
32.తెలుగు భాష-అంతర్జాల వినియోగం
33.తెలుగు భాష-పరిశోధన
34.బడిభాష-ప్రాధాన్యం
35.తెలుగు భాష-అకాడమీ కృషి
36.తెలుగు భాష-భారతీయ భాషాశాస్త్రవేత్తల దృక్ఫథం
37.తెలుగు భాష – ఉపాధి అవకాశాలు
38.భాష-భాషాశాస్త్రం
39. డిగ్రీ పాఠ్యాంశాలలో తెలుగు భాషా ప్రాధాన్యం
40. మొదటి మాధ్యమంగా తెలుగు భాష
41. తెలుగు భాష- శాస్త్రీయ అధ్యయనం
42. కేంద్రీయ విద్యావిధానం –తెలుగు ఆవశ్యకత
43.తెలుగు భాష-ప్రవాసాంధ్రుల కృషి
44.పోటీ పరీక్షలు-తెలుగు భాషా ప్రాధాన్యం
45.విశ్వవిద్యాలయాలు-తెలుగు భాషా సేవ

వీటిలో మీకు నచ్చిన అంశాన్ని తీసుకొని పరిశోధన పత్రం సమర్పించవచ్చు . పరిశోధన పత్రాలు *ఆంధ్ర సాహితి* జర్నల్ లో ప్రచురించబడతాయి .మీ పరిశోధన పత్రాలను teluguseminarau@gmail.com అనే మెయిల్ ఐడి కి 10/02/2024 లోపు పంపగలరు.పరిశోధన పత్రాలను పేజీమేకర్ అను 7 ప్రియాంక పాంట్ 18 ,లైన్ స్పేస్ 21 లో 4 లేదా 5 పేజీలలో సమర్పించవలెను.ఆధార గ్రంథాలు తప్పనిసరి.
పరిశోధనా పత్రం పంపే సమయంలో వ్యాసంలో ఏమైనా తప్పులుంటే సరిచూసికొని పత్రాన్ని పంపాలి. విషయ సేకరణ కు తోడ్పడిన వ్యక్తుల వివరాలు పొందుపరచవచ్చు. సూచన PDF files ,word files ,mandali వంటి వాటిలో పంపే ఆర్టికల్స్ తిరస్కరించబడతాయి. ఈ క్రింది లింక్ ద్వారా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కాగలరు

Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/F3ew9VNe0131QE8KHW5EI4

జాతీయ సదస్సు నమోదు రుసుము :

1) ఆచార్యులకు,అధ్యాపకులకు – ₹ 700/-

2) పరిశోధక విద్యార్ధులకు – ₹ 500 /-

3) విద్యార్ధులకు – ₹ 300/-

గూగుల్ పే లేదా ఫోన్ పే – 86880 61477
(గొంటి బాబ్జీ) లో రుసుము చెల్లించగలరు.

మరిన్ని వివరాలకు

ఆచార్య జర్రా అప్పారావు
(9492495813)
శాఖాధిపతి & సదస్సు సంచాలకులు
తెలుగు విభాగం
ఆంధ్రా విశ్వకళాపరిషత్
విశాఖపట్నం

డా బూసి వెంకటస్వామి
(7989781963)
సదస్సు సమన్వయకర్త
తెలుగు విభాగం
ఆంధ్రవిశ్వకళాపరిషత్
విశాఖపట్నం.