NML: కలెక్టర్ అభినవ ఆదేశాల ప్రకారం నిర్మల్ జిల్లా లో జిల్లా స్థాయి యువజనోత్సవాలు ఎన్టీఆర్ స్టేడియం లో ఘనంగా మంగళవారం నిర్వహించడం జరిగింది. వీటిలో వివిధ రంగాల్లో పోటీలుపెట్టారు గెలుపొందిన విద్యార్థులకు జిల్లా అదనపు కలెక్టర్ పైజల్ అహ్మద్ బహుమాతులను అందించారు. ఇందులో సిర్గాపూర్ ఫ్లేర్ హై స్కూల్ కు చెందిన ఆడెపు పూజ క్రాప్ట్ లో ప్రథమ బహుమతిని, కే దీప్తి క్రాప్ట్ లో తృతీయ బహుమతిని, మనీషా డ్రాయింగ్ లో తృతీయ బహుమతిని, మహిత్ రెడ్డి వచన కవిత్వం లో తృతీయ బహుమతులను అందుకున్నారు.