తెలంగాణ గొప్పతనం . స్వరాలు

లలితా రెడ్డి

అంశం తెలంగాణ గొప్పతనం
మెయిల్ reddylalitha6@gmail.com
ప్రక్రియ స్వరము

1.స్వరము

భారతావని సిగనందున
మెరిసిన పువ్వుతెలంగాణ
అభివృద్ధి బాటలో నడిచే
అద్భుతమైనట్టి తెలంగాణ
పేరుప్రఖ్యాతుల తెలంగాణ

2.స్వరము

కూలినాలి చేసేటి జనులు
కడుపులను నింపుకుందురు
లోటన్నది ఏమి లేకుండను
లోకులందరును బ్రతుకును
అదే మన తెలంగాణ గొప్ప

3. స్వరము

అద్భుతమైన పంటలెన్నో
పండించుటకు అనువైనట్టి
సిరులిచ్చు మాగాణి మాతృక
జనులందరి ఆకలితీర్చు
అన్నపూర్ణమ్మ మా తెలంగాణ

4.స్వరము

చిన్నచిన్న పరిశ్రములెన్నో
పురుడునుపోసుకున్నవి
బీదబిక్కి సు జనులకేమో
జీవితాన్నేమో ఇస్తున్నట్టిది
కూడుగూడును నిస్తున్నట్టిది

5.స్వరము

ప్రగతిశీల భావాలతోటి
పథకాలెన్నో ప్రారంభించెను
పేదవారందరికీ కూడాను
అండదండగాను నిలెచెను
తల్లిలాగాను ఆదరించెను

6.స్వరము

కొత్తకొత్త పరిశోధనలు
నిత్యమున్ను జరపడానికి
ప్రోత్సహములను అందించును
సొంత కాళ్లపై నిలబడేలా
వెన్నుతట్టి వెన్నంటి ఉండెను

7.స్వరము

అభివృద్ధికి బాటలువేసి
ఆర్ధికముగాను ఊతమిచ్చి
ఉద్యోగాలెన్నో కల్పించునురా
జనులకేమో చేయూతనిచ్చి
బాగుచేయును ఈ తెలంగాణ

8.స్వరము

నేడు రేపు విద్యార్థులకేమో
మంచి విద్యను అందించుచు
భావి భారత పౌరులుగాను
మరిచక్కగా తీర్చిదిద్దుతూ
చదువునిచ్చేటి తెలంగాణ

9.స్వరము

గనులేమో నిండుగా ఉన్నవి
గల్లాపెట్టెలు నింపుతున్నవి
నిత్యమును కూడా ఎందరికో
జీవనోపాధిని ఇస్తున్నట్టి
చక్కనైనట్టి ఈ తెలంగాణ

10.స్వరము

ఇతర రాష్ట్రాల వారికిని
అక్కున చేర్చుకొనేటి అమ్మ
కులమతాలకు అతీతముగా
అందరిని కలిపి ఉంచును
అదే మా తెలంగాణ ఘనతి

పూర్తిపేరు లలితారెడ్డి
తండ్రిపేరు కృష్ణమూర్తి
కిల్లిపాలేం గ్రామం
శ్రీకాకుళం మండలం, జిల్లా
మొబైల్ నెంబర్ 9704699726