సాహితీ నవరత్నం

పిల్లి .హజరత్తయ్య సింగరాయకొండ, ప్రకాశం జిల్లా

ప్రక్రియ:నవరత్నాలు

పేరు: పిల్లి .హజరత్తయ్య

ఊరు: సింగరాయకొండ, ప్రకాశం జిల్లా

101) నాదేశం సంస్కృతి, సాంప్రదాయాలకు నిలయం
నాదేశం సత్యము, అహింసలకు పుట్టినిల్లు
నాదేశం సనాతన ధర్మానికి మూలస్థానం
నవరత్నాలు మానవహిత కారకాలు

102)నృత్యం చేయడం మహత్తరమైన కళ
నటరాజుని మెప్పించడం చాలా కష్టము
నాట్యంలోని భంగిమలు అత్యద్భుతం
నవరత్నాలు మానవహిత కారకాలు

103) నాలో లక్ష్యం అనే విత్తు నాటి
నాకు మంచి చెడుల విచక్షణ తెలిపి
నాకు ఉత్తమ మార్గం చూపినాడు గురువు
నవరత్నాలు మానవహిత కారకాలు

104) నేను అనే ఆత్మాభిమానం మంచిదైతే
నేను అనే అహంకారం మనిషిని
నిలువునా దిగజారుస్తుంది
నవరత్నాలు మానవహిత కారకాలు

105) నీ విలాసవంతమైన జీవితము
నీ బొందిలో ప్రాణం ఉన్నంత వరకే
నీ కోట్లు నిన్ను కాపాడు లేవని తెలుసుకో
నవరత్నాలు మానవహిత కారకాలు

106) నీవు అనుభవించక ఆకలితో అలమటించి
నీవు ధనాన్ని దాచి ఆస్తులు పేర్చి
నీవు అనుభవించక మరణిస్తే ఏమిలాభం?
నవరత్నాలు మానవహిత కారకాలు

107) నమ్మకంతో చేసే ప్రయత్నంలో
నువ్వు గెలవకపోవచ్చు కానీ
నీప్రయత్నం నీకు అనుభవాలు నేర్పుతుంది
నవరత్నాలు మానవహిత కారకాలు

108) నీలో రాక్షసత్వమును తొలగించుకుని
నీలో ఉన్న దుర్గుణాలను తొలగించి
నలుగురి కోసం జీవించుము
నవరత్నాలు మానవహిత కారకాలు

109) నీ పుట్టుక నీ కోసం కాదని
నీ జీవనం ఎదుటివారి కోసమని
నిజాలను తెలుపుతుంది ప్రకృతి
నవరత్నాలు మానవహిత కారకాలు

110) నీడనిచ్చి సేద తీర్చటయేకాక
నిస్వార్థముతో నీకు తోడ్పడి
నీ ప్రాణాలను నిలుపును తరువులు
నవరత్నాలు మానవహిత కారకాలు

111) నా అనే వారు ఎందరున్నను
నిన్ను నమ్మించేవాళ్లు ఎందరున్నా
నమ్మకంగా నీతో ఉండేది నీ భార్యే
నవరత్నాలు మానవహిత కారకాలు

112) నమ్మకమనే చెట్టు నీడన
నీవు,నేను,మనమందరం ఏకమైతిమి
నమ్మకమే మనందరిని కలిపింది
నవరత్నాలు మానవహిత కారకాలు

113) నమ్మకాన్ని పెంచుకున్న జీవితమే
నిలకడగా కొనసాగుతూ
నమ్ముకున్న వారికి నీడనిస్తుంది
నవరత్నాలు మానవహిత కారకాలు

114) నమ్మకం విలువ తెలుసుకుని
నమ్మకానికి ప్రతిరూపంగా నిలిచి
నమ్మకమనే గుండెలో చిరంజీవిగా వెలుగు
నవరత్నాలు మానవహిత కారకాలు

115) నమ్మకం అనుబంధాలకు మూలమై
నిన్ను నన్ను ముందుకు నడిపించు
నమ్మకాన్ని వమ్ముచేయక మనుగడ సాగించు
నవరత్నాలు మానవహిత కారకాలు

116) నిజము,అబద్ధాల వారధి నమ్మకమే
నమ్మకమే జీవితానికి ఆధారము
నమ్మకానికి నిలువెత్తు రూపము నానే కదా
నవరత్నాలు మానవహిత కారకాలు

117) నమ్మిన వారిని నట్టేట ముంచక
నమ్మించి గొంతు కోయడం చేయక
నమ్మకానికి నిలువెత్తు నిదర్శనంగా నిలువు
నవరత్నాలు మానవహిత కారకాలు

118) నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి
నలుగురి ముందు పలచన కాకు
నోటిని అదుపులో పెట్టుకొని మాట్లాడు
నవరత్నాలు మానవహిత కారకాలు

119) నువ్వు చేసే పనిని గురించి
నీ అంతరాత్మకు చెప్పగలిగితే
నువ్వు ఎవరికీ భయపడాల్సిన పనిలేదు
నవరత్నాలు మానవహిత కారకాలు

120) నీ నిర్ణయం ప్రకారం నడిచి
నీవు అందరితో చక్కగా మాట్లాడితే
నీకు అందరు తోడై నిలుస్తారు
నవరత్నాలు మానవహిత కారకాలు

121) నటన ప్రపంచంలో ఎవ్వరినీ
నమ్మి ముందుకు సాగకుండా
నిన్ను నీవు నమ్మి నడువుము
నవరత్నాలు మానవహిత కారకాలు.

122) నేటి పరిస్థితిని చూసి నువ్వు
నివ్వెరపోకుండా ముందుకు సాగి
నీ లక్ష్యాలను చేరుకోవాలి
నవరత్నాలు మానవహిత కారకాలు

123) నీ ఆస్తులను చూసి నడవకుండా
నీ మంచితనం ఇష్టపడి నడిస్తే
నీవు నిజమైన గొప్ప నాయకుడువే
నవరత్నాలు మానవహిత కారకాలు

124) నలుపు రంగు అపశకునం అయితే
నలుపురంగు బోర్డు మాత్రము
నింపుతున్నది వెలుగులను
నవరత్నాలు మానవహిత కారకాలు

125) నిమ్న తరగతి కుటుంబాలలో
నిత్యం సమస్యలు పలకరించినా
నమ్మకంతో ముందుకు సాగుతారు
నవరత్నాలు మానవహిత కారకాలు

126) నవ్విస్తూ జీవనం సాగించకపోతే
నవ్వినా,ఏడ్చినా కన్నీళ్ళే వచ్చు
నవ్వడము దేవుడిచ్చిన వరము
నవరత్నాలు మానవహిత కారకాలు

127) నీవుకష్టాల్లో ఉన్నట్లయితే
నిన్ను ఎవరూ పట్టించుకోరు
నీవు విజయుడవైతే నిన్ను వదులుకోరు
నవరత్నాలు మానవహిత కారకాలు

128) నటించేవారు బాగా బ్రతికినా
నిజము బయటపడిన నాడు
నిజాయితీనే మనకు అండగా నిలుచును
నవరత్నాలు మానవహిత కారకాలు

129) నీ ఆనందాన్ని పంచుకునే వారికంటే
నీ బాధలను పంచుకునే వారికే
నీవు ఎక్కువ విలువ ఇవ్వము
నవరత్నాలు మానవహిత కారకాలు

130) నీ గాన ప్రతిభ ఎప్పటికీ
నీ సుమధురాలు ఎన్నటికీ
నీవులేకున్నా మా చెవులో ధ్వనిస్తాయి బాలు
నవరత్నాలు మానవహిత కారకాలు

131) నీవు పాడిన ప్రతి పాటయు
నవరసాలు జల్లు కురిపించి
నాణ్యత నవ్యతతో మెరిసాయి బాలు
నవరత్నాలు మానవహిత కారకాలు

132) నీ తప్పు ఏమీ లేకపోయినా
నిను నిందించే మనుషులకి
నువ్వు మౌనంతో సమాధానమివ్వు
నవరత్నాలు మానవహిత కారకాలు

133) నీవు సూటిగా మాట్లాడి చూడు
నీ పక్కన ఒక్కరు కూడా ఉండరు
నీ సూటితనమును ప్రశ్నిస్తారు
నవరత్నాలు మానవహిత కారకాలు

134) నలుగురికి పంచేది జీవితమే
నలుగురిని బాగు చేసేది జీవితమే
నలుగురు అభినందిస్తే జన్మసార్థకమే
నవరత్నాలు మానవహిత కారకాలు

135) నీవు ఎవరిని నమ్మవద్దు
నమ్మి ఎవరితో ఏది చెప్పవద్దు
నిజస్వరూపాన్ని అంచనా వేయడం అసాధ్యము
నవరత్నాలు మానవహిత కారకాలు

136) నీవు ఆశించినంత చేయలేకపోవడం
నీవు చేయలేనంత ఆశించడం
నీలోని అసమర్థతకు నిదర్శనాలు
నవరత్నాలు మానవహిత కారకాలు

137) నీటిలో పడే ప్రతివాడు చనిపోడు
నమ్మకం లేకపోవడమే మరణము
నీ ఆత్మవిశ్వాసమే జీవితానికి జననము
నవరత్నాలు మానవహిత కారకాలు

138) నీవు ఆనందంగా ఉండడమంటే
నీ ఆస్తులతో జీవించడం కాదు
నిజమైన ఆత్మీయులను కలిగి ఉండడము
నవరత్నాలు మానవహిత కారకాలు

139) నీవు సంస్కారంతో నడుచుకుంటే
నీవు మంచిఅలవాట్లు కలిగి ఉంటే
నిన్ను ప్రతి ఒక్కరు ఆరాధిస్తారు
నవరత్నాలు మానవహిత కారకాలు

140) నీకు విలువ ఉండకపోతే
నీవు నిలదొక్కుకున్నప్పుడు
నీ నిజానికి గెలిచే శక్తి ఉండదు
నవరత్నాలు మానవహిత కారకాలు
141) నాన్నకు, నాకు మంచి నడత నేర్పి
నాకు మంచి చెడులు వివరించి
నా జన్మకు మూలమైనది నానమ్మ
నవరత్నాలు మానవహిత కారకాలు

142)నీ జీవితాన్ని త్యాగం చేసి
నిజాయితీ నింపే కథలను నేర్పి
నాలో అనుబంధాలను పెంచెను నానమ్మ
నవరత్నాలు మానవహిత కారకాలు

143) నీవు సహనానికి మారుపేరుగా నిలిచి
నీ కుటుంబాన్ని క్రమశిక్షణలో నుంచి
నీవు మా హృదయంలో నిలిచితివి నానమ్మ
నవరత్నాలు మానవహిత కారకాలు

144) నీవు ఉన్నప్పుడు నీతో గడపక
నీ మరణం కోరుకున్న మేము
నీ అవసరం నేడు తెలుసుకుంటిమి నానమ్మ
నవరత్నాలు మానవహిత కారకాలు

145) నీ జ్ఞాపకాల దొంతరలో బతుకునీడుస్తూ
నీవు లేక ఎద చిక్కి శల్యమైనది
నువ్వు మరలా మాకోసం రావా నానమ్మ
నవరత్నాలు మానవహిత కారకాలు

146) నీవు ఎంత గొప్పవాడిగా ఎదిగినా
నీకు కొందరు విమర్శలు తప్పవు
నీ వ్యక్తిత్వం ఎదుగుదలకు అవి సోపానాలు
నవరత్నాలు మానవహిత కారకాలు

147) నీటిలో రాయిని వేయడం సులభమే
నీవు రాయిని తేవడం చాలా కష్టము
నీవు ఎదగాలంటే సహనం నేర్వాలి
నవరత్నాలు మానవహిత కారకాలు

148) నీ జీవితంలో ఎన్నో సమస్యలు
నీ హృదయంలో మరెన్నో బాధలు
నీవు ఎదుర్కొనే సాధక బాధలే జీవితము
నవరత్నాలు మానవహిత కారకాలు

149) నీవు డబ్బు ఎవరి కోసమైనా ఖర్చుచెయ్యి
నీ సమయాన్ని మాత్రం ఆదా చేయ్యి
నీవు పాటించే సమయపాలనే నీకు రక్ష
నవరత్నాలు మానవహిత కారకాలు

150) నీకు ఎంత కష్టం వచ్చినా సరే
నీ కష్టాన్ని పెదవి దాటనివ్వకు
నీ పెదవులు దాటితే నిన్ను నీవు కోల్పోతావు
నవరత్నాలు మానవహిత కారకాలు

151) నువ్వు చేసే ప్రతి పని అందరినీ
నీ ప్రవర్తన ఎదుటి వారిని
నిన్ను ఆనందపరిచేదిగా ఉండాలి
నవరత్నాలు మానవహిత కారకాలు

152) నువ్వు పుడితే తల్లి సంతోషపడు
నీవు పెరిగితే తండ్రి ఆనందపడు
నీవు బతికితే సమాజం గర్వపడాలి
నవరత్నాలు మానవహిత కారకాలు

153) నమ్మకం ఉంటే మౌనం అర్థమవుతుంది
నమ్మకం లేకుంటే అపార్థం మిగులుతుంది
నమ్మకం అనేది బంధాలకు ఆత్మలాంటిది
నవరత్నాలు మానవహిత కారకాలు

154) నువ్వు ఉన్నా లేకపోయినా కాలం ఆగదు
నువ్వు ఉన్నప్పుడు నీలో మంచిని బ్రతికించు
నువ్వు లేకపోయినా కాలంనిన్ను మరవదు
నవరత్నాలు మానవహిత కారకాలు

155) నువ్వు ఏ పని చేసినా రాళ్లు విసిరుతారు
నీవు రాళ్లను గెలుపుబాటగా పరుచుకో
నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది
నవరత్నాలు మానవహిత కారకాలు

156) నువ్వు గెలిచేవరకు నీ అవసరం లేదు
నిన్ను ఎవరూ పట్టించుకోరు
నీ కథ వినాలంటే ముందు నీవు గెలవాలి
నవరత్నాలు మానవహిత కారకాలు

157) నీకోసం చేసేది నీతోనే అంతరించు
నీవు ఇతరుల కోసం చేసేది జీవించు
నిన్ను నీవు శాశ్వతంగా మలుచుకో
నవరత్నాలు మానవహిత కారకాలు

158) నీ జీవితంలో ఏది నీ వెనుకరాదు
నువ్వు సంతోషంతో గడిపిన క్షణాలు తప్ప
నువ్వు మంచితనం సంపాదించు
నవరత్నాలు మానవహిత కారకాలు

159) నిజం చెప్పడానికి ధైర్యం ఉండాలి
నిజమే అయినా ఇతరులు నొచ్చుకో రాదు
నొచ్చుకోకుండా చెప్పే సంస్కారం ఉండాలి
నవరత్నాలు మానవహిత కారకాలు

160) నీవు తేనెను నీరులా తాగకూడదు
నీతో మంచిగా మాట్లాడుతున్నామని
నీ బలాన్ని బలహీనతగాని చెప్పకు
నవరత్నాలు మానవహిత కారకాలు

161) నేను స్వలాభం కోసం చూస్తున్నప్పుడు
నాలోని స్వార్థాన్ని పారద్రోలి
నీవు జనంకోసం జీవించాలని బోధచేస్తాడు
నవరత్నాలు మానవహిత కారకాలు

162) నేను ఆలోచన శూన్యడనైనప్పుడు
నా అంతరంగం అదిలించి
నా సందేహశకలాన్నీ పెకలింపజేస్తాడు
నవరత్నాలు మానవహిత కారకాలు

163) నా ప్రశ్నలకు సమాధానాలివ్వకుండా
నన్నే తవ్వి తెలుసుకోమని జ్ఞానగనుల్లోకి
నా చెయ్యి పట్టి నడిపిస్తాడు గురువు
నవరత్నాలు మానవహిత కారకాలు

164) నేను నేటి మీద నడుస్తున్నప్పుడు
నీవు రేపటిని సమీకృతీకరించుకోమని
నయన ద్వయానికి శిక్షణనిస్తాడు గురువు
నవరత్నాలు మానవహిత కారకాలు

165) నీ చిరునవ్వు స్నేహితులను అందించు
నీ కోపము శత్రువుల నిచ్చు
నీవు జీవితంలో చిరునవ్వుతో జీవించాలి
నవరత్నాలు మానవహిత కారకాలు

166) నిన్ను విజయం ఉన్నతస్థితికి చేర్చు
నీ మంచి ప్రవర్తన నీకు మంచి చేయు
నువ్వు అందరి హృదయాల్లో చోటు సాధిస్తావు
నవరత్నాలు మానవహిత కారకాలు

167) నువ్వు తల వంచి నడవకు నేస్తం
నీవు శిరమెత్తి ముందడుగు వేయి
నీకు దాసోహమవుతుంది లోకమే
నవరత్నాలు మానవహిత కారకాలు

168) నవ్వడానికి ఏమీ ఖర్చు కాదు
నవ్వడం మరిస్తే ఖర్చు చేయాల్సి రావచ్చు
నీవు అందుకే ఎప్పుడూ నవ్వుతూ ఉండు
నవరత్నాలు మానవహిత కారకాలు

169) నీవు ఓడినప్పుడు మాత్రమే
నీ ప్రపంచము ఎంత చిన్నదో
నీ వాళ్ళు ఎంత తక్కువమందో తెలుస్తుంది
నవరత్నాలు మానవహిత కారకాలు

170) నిన్ను పొగిడిన వారిని మర్చిపోవచ్చు
నీకు చేయూతనిచ్చిన వారిని మాత్రం
నీవు ఎప్పటికీ మరవరాదు
నవరత్నాలు మానవహిత కారకాలు

171) నీకు విజయం ఒక్క రోజులో రాదు
నీవు ప్రతిరోజు కష్టపడితే
నీకు ఏదో ఒక రోజు కచ్చితంగా వస్తుంది
నవరత్నాలు మానవహిత కారకాలు

172) నాచే సమాజంలో విలువలు పెంచి
నాలోని సామాజిక రుగ్మతలను పోగొట్టి
నాలో దీపాలను వెలిగించు గురువు
నవరత్నాలు మానవహిత కారకాలు

173) నీపై ప్రేమ ఉన్నవారు ఎవరు
నిన్ను వదిలి పెట్టిక నీ వెంటే నడుచు
నీ కష్టాలలో పాలుపంచుకుంటారు
నవరత్నాలు మానవహిత కారకాలు

174) నీకు ఆస్తి ఉంటే ధనం పంచుతావు
నీకు గుణం ఉంటే హృదయాన్ని పంచుతావు
నీకు వ్యక్తిత్వముంటే ఇలలో నిలిచిపోతావు
నవరత్నాలు మానవహిత కారకాలు

175) నీ చుట్టూ ఉండేవారికి నీ గురించి
నీ గొప్పతనం గురించి తెలియదు
నీ విలువ తెలిసేసరికి దూరమైపోతావు
నవరత్నాలు మానవహిత కారకాలు

176) నీవు ఒక మంచి పుస్తకం కొంటే
నీకు మంచి విజ్ఞానాన్ని పంచును
నీకుండే మిత్రుడు గ్రంథాలయంతో సమానం
నవరత్నాలు మానవహిత కారకాలు

177) నీ అహంకారం ప్రతి ఒక్కరి నుంచి
నిన్ను ఆఖరికి భగవంతుడి నుంచి
నిన్ను దూరం చేయును జాగ్రత్త సుమా
నవరత్నాలు మానవహిత కారకాలు

178) నీ కష్టాలు ఎవరికీ రాకూడదని తలువు
నీ సమస్యలు ఎవరిని బాధించరాదని
నీవు ఆలోచించు మహాత్ముడైపోతావు
నవరత్నాలు మానవహిత కారకాలు

179) నీ కీర్తి ప్రతిష్టలు శాశ్వతం కావు
నీ పాండిత్యము అండగా నిలవవు
నీ సత్ప్రవర్తనే నీకు శ్రీరామరక్ష
నవరత్నాలు మానవహిత కారకాలు

180) నీవు వినయంగా జీవించుము
నీవు ఇతరులతో మర్యాదగా వ్యవహరించు
నిన్ను ప్రేమించని మనిషే ఉండడు
నవరత్నాలు మానవత కారకాలు

181) నీవు అందరిలో ఆప్యాయత పంచు
నీవు అందరితో సంస్కారంతో నడువు
నీలోని లక్షణాలు నిన్ను హీరోని చేస్తాయి
నవరత్నాలు మానవహిత కారకాలు

182) నీ సంతోషాన్ని రెట్టింపు చేసేవారు
నీ బాధలను తగ్గించేవారు
నీకు నిజమైన ఆత్మీయులు
నవరత్నాలు మానవహిత కారకాలు

183) నీవు విజయం వైపు అడుగులు వేస్తే
నీకు ఏదో ఒక రోజు తప్పకవచ్చు
నీవు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తావు
నవరత్నాలు మానవహిత కారకాలు

184) నీవు సమస్యలను జయించే నేర్పును
నీవు అనుభవం గడించినా
నీకు జీవితంలో సమస్యలు రావు
నవరత్నాలు మానవహిత కారకాలు

185) నీవు గతాన్ని ఆలోచిస్తూ కూర్చోకు
నీ భవిష్యత్తు గురించి ఆలోచించు
నీ చిరునవ్వుతో వర్తమానాన్ని ఆస్వాదించు
నవరత్నాలు మానవహిత కారకాలు

186) నీవు అనుకున్నది సాధించాలంటే
నువ్వు ఎంత కష్టాన్నికైనా సిద్ధపడాలి
నిన్ను చూసి ఓటమి కూడా భయపడాలి
నవరత్నాలు మానవహిత కారకాలు

187) నీవు విజయం కోసం దూరమైనా పరిగెత్తు
నీవు వెనుకకు తిరిగి చూడకు
నీ వెనుక నిను ఓడించాలనేవారు ఉంటారు
నవరత్నాలు మానవహిత కారకాలు

188) నీలికన్నుల సోయగాలు పంచావు
నుదుట తిలకం దిద్దినావు
నూరేళ్ల జీవితాన్ని పంచినావు
నవరత్నాలు మానవహిత కారకాలు

189) నీ రూపు చాలా చక్కనైనది
నీ మనసు బాగా సున్నితమైనది
నాలో నీ హృదయం లీనమైనది
నవరత్నాలు మానవహిత కారకాలు

190) నెలవంక తొంగి చూచినది
నీవు నిత్య వెలుగులో ప్రకాశించినావు
నీవు యవనికపై మెరిశావు
నవరత్నాలు మానవహిత కారకాలు

191) నేను కవితలు ఎన్నో రాసి
నా సమాజానికి మేలు చేస్తే
నా కృషి ఫలించినట్లేనని భావిస్తాను
నవరత్నాలు మానవహిత కారకాలు

192) నేను బంగారం స్వచ్ఛతను పరీక్షించాలి
నేను బొగ్గును పరిక్షించ నవసరం లేదు
నీ వంటి మంచివారికే పరీక్షలు ఉంటాయి
నవరత్నాలు మానవహిత కారకాలు

193) నీవు అబద్ధం ఆడేవారిని క్షమించు
నిజం చెప్పేవారిని క్షమించు
నమ్మించే వారిని క్షమించవద్దు
నవరత్నాలు మానవహిత కారకాలు

194) నువ్వు ఓపిక ఉన్నంతవరకు కాదు
నీవు ఊపిరి ఉన్నంతవరకు పోరాడు
నీకు గెలుపు స్వాగతం పలుకుతుంది
నవరత్నాలు మానవహిత కారకాలు

195) నేడు రోజులు వేగంగా మారుతున్నాయి
నేడు మనుషుల గుణాలు మారుతున్నాయి
నటించేవారు మాత్రం మారడంలేదు
నవరత్నాలు మానవహిత కారకాలు

196) నీకు అబద్ధం చెప్పేవారి కన్నా
నీవు బాధపడిన పర్వాలేదని
నిజం చెప్పేవారిని నీవు నమ్మాలి
నవరత్నాలు మానవహిత కారకాలు

197) నిన్ను నమ్మి నీస్నేహితుడు
నీకు చెప్పుకున్న తన రహస్యాన్ని
నీ పెదవి దాటితే నీవు మరణించినట్లే
నవరత్నాలు మానవహిత కారకాలు

198) నాలుగు మంచి పనులు చేస్తే
నీ జీవితంలో కష్టకాలం వచ్చినపుడు
ఓడలుగా మారి సహాయపడతాయి
నవరత్నాలు మానవహిత కారకాలు

199) నీకష్టాన్ని నీవే ఓదార్చుకో
నీ కష్టాలు చూసి నవ్వతారే తప్ప
“నా” అనే వారు ఎవరు దగ్గరికి తీయరు
నవరత్నాలు మానవహిత కారకాలు

200) నేను ఎన్నోప్రశ్నలు గుప్పిస్తుంటే
నాకు సమాధానాలు నేరుగా ఇవ్వకుండా
నా చెయ్యిపట్టి జ్ఞానగనుల్లోకి నడిపిస్తాడు
నవరత్నాలు మానవహిత కారకాలు