అహింస విధానంలో నడుద్దాం
—————————————
ఆర్యవైశ్య సమాజమంతా అహింస పద్దతులలో జీవనం సాగించాలని అనంతపురం జిల్లా ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షులు శ్రీ. కె. నారాయణ మూర్తి పిలుపునిచ్చారు. మన కులదేవత ఆనాడు అహింసా పద్దతులను విడనాడేందుకే అగ్నిప్రవేశం చేసిన ఆదిపరాశక్తి స్వరూపురాలని, మానవీయ విలువలకోసం ఆమె త్యాగాలే లోకానికి ఆదర్శమని,అన్నారు. పామిడి ఆర్యవైశ్య సంఘంఅధ్యక్షులు ఇల్లూరు ఉపేంద్ర అధ్యక్షతన కొనసాగిన వాసవిజయంతి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
పామిడి వాసవి కన్యకా పరమేశ్వరీ దేవాలయంలో విశేష అభిషేకం అర్చన గావంచిన అనంతరం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని విశేష పుష్ప అలంకరణ గావించి వాసవి మాతృమండలి కలశాలతో గ్రామోత్సవం మేళ తాళాలతో ఘనంగా నిర్వహించారు. ఫల, పుష్ప, తాంబూలాదులను కొబ్బరికాయ లను సమర్పించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు.అసని తుఫాన్ వర్షం లో ఉత్సవం జరిగింది సంఘం నాయకులు ఉపేంద్ర, నాగార్జున, నల్లయ్య, రామమోహన్, రత్నమయ్య, అమర్నాథ్, సుదాకర్, మాతృమండలి అధ్యక్షురాలు రాజేశ్వరీ పాల్గొన్నారు.